JioMotive డ్రైవింగ్ పద్ధతిని కూడా విశ్లేషిస్తుంది. అధిక వేగం, సడన్ బ్రేకింగ్, వేగంగా యాక్సిలరేషన్, హఠాత్తుగా మలుపులు తిప్పడం వంటి అంశాలపై అలర్ట్‌లు పంపుతుంది. దీంతో సురక్షితమైన డ్రైవింగ్ అలవాట్లు అలవర్చుకోవచ్చు. గత ప్రయాణాల వివరాలను కూడా పరిశీలించవచ్చు.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ఈ పరికరం జియో SIMతో మాత్రమే పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ కార్లు, భారీ వాణిజ్య వాహనాలు, కొన్ని ప్రత్యేక కార్ మోడళ్లకు సపోర్ట్ ఉండదు. ఒకసారి జియో నంబర్‌తో యాక్టివేట్ చేసిన తర్వాత ఆ నంబర్‌ను మార్చడం సాధ్యం కాదు. కొనుగోలు చేసిన తర్వాత ఇది సాధారణంగా నాన్-రిటర్నబుల్ ఉత్పత్తిగా ఉంటుంది. కారు భద్రత, ట్రాకింగ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఒకే పరికరంలో కావాలనుకునే వారికి JioMotive మంచి ఎంపికగా చెప్పవచ్చు.