ఇప్పుడు మొబైల్ ఫోన్లకు టైప్-సి చార్జర్లే ప్రామాణికం. ఫోన్లే కాదు ల్యాప్‌టాప్‌లతో సహా ఎన్నో ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్లలో టైప్-సి పోర్టులే వస్తున్నాయి. రోజూ వాడే ఈ టైప్-సి చార్జర్‌లో 'C'కి అర్థం ఏంటో తెలుసా?
మీరు టైప్-సి ఛార్జర్ వాడుతున్నారా? అసలు 'సి' అంటే ఏమిటి?
Type-C Charger : ఈ రోజుల్లో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, చివరికి ఆటబొమ్మలకు కూడా టైప్-సి చార్జింగే కామన్ అయిపోయింది. ప్రతిరోజు కోట్లాదిమంది ఈ చార్జర్ ను వాడుతుంటారు... కానీ చాలామందికి టైప్-సి లో 'సి' కి అర్థం ఏమిటో తెలియదు. నిజానికి టైప్-సిలోని 'C' అక్షరానికి ఎలాంటి పూర్తి రూపం (ఫుల్ ఫామ్) లేదు. ఇది చార్జింగ్ టెక్నాలజీలో మూడో తరం… అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. దీనికంటే ముందు టైప్-ఎ, టైప్-బి చార్జర్లు వాటి తరం, ఆకారం ఆధారంగా పేర్లు పొందాయి.
25
ప్రపంచవ్యాప్తంగా టైప్-సి దే హవా
గతంలో టైప్-ఎ, టైప్-బి అనే రెండు తరాల చార్జర్స్ ఉండేవి... ప్రపంచంవ్యాప్తంగా వీటినే ఉపయోగించేవారు. అయితే టెక్నాలజీ డెెవలప్ అయ్యాక ఈ టైప్-ఎ, టైప్-బి ఛార్జర్లలో సమస్యలను పరిష్కరించడానికే టైప్-సిని డిజైన్ చేశారు. ఇది కేవలం మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లకే కాదు అనేక ఎలక్ట్రిక్ వస్తువుల ఛార్జింగ్ కు ఉపయోగపడుతోంది. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ టైప్-సి ఛార్జర్ ని విరివిగా వాడుతున్నారు.
35
టైప్-ఎ, టైప్-బి ఛార్జర్స్ కంటే టైప్-సి ఎందుకు బెటర్?
టైప్-ఎ, టైప్-బి చార్జర్లతో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే వాటిని సరైన దిశలోనే పోర్టులో పెట్టాలి. రివర్స్‌లో పెట్టడానికి ప్రయత్నిస్తే పోర్ట్ లేదా కేబుల్ పాడయ్యేది. ఈ సమస్యను అధిగమించడానికే టైప్-సి వచ్చింది. దీన్ని ఎలాగైనా ప్లగ్ చేయొచ్చు. కాలక్రమేణా చార్జింగ్ ప్రమాణాలు ఎంత మారుతున్నా టైప్-సి పోర్ట్ ఆకారాన్నే అందరూ ఫాలో అవుతున్నారు.
టైప్-సి పోర్ట్‌తో కేవలం రివర్స్‌లో పెట్టే సమస్య తీరడమే కాదు చాలా ప్రయోజనాలున్నాయి. పాత చార్జర్లతో పోలిస్తే ఇది ఎక్కువ పవర్‌ను అందిస్తుంది. దీని ద్వారా డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ కూడా చాలా ఎక్కువ (10 Gbps వరకు). ఫోన్ చార్జింగే కాకుండా, మానిటర్లు, టీవీలు వంటి ఇతర పరికరాలను కూడా దీనితో కనెక్ట్ చేయవచ్చు.
55
టైప్-డి ఛార్జర్ వస్తుందా?
ప్రస్తుతానికి టైప్-సి తర్వాత టైప్-డి వంటి టెక్నాలజీ వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ చట్టం ప్రకారం టైప్-సిని అధికారిక చార్జింగ్ ప్రమాణంగా మార్చారు. అంతేకాదు టైప్-సి టెక్నాలజీని నిరంతరం మెరుగుపరుస్తున్నారు. సైజు అదే ఉన్నా దాని వేగం, ఫీచర్లు పెరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా టైప్-సి పోర్టే కొనసాగనుంది.