రిలయన్స్ జియో వినియోగదారులకు అతి తక్కువ ధరలకే భారీ ఆఫర్లను అందిస్తోంది. జియో సిమ్ యూజర్లకు ఇప్పటికే పలు ఆఫర్లు ప్రకటించింది. అంతే కాదు.. జియో వినియోగదారులు జియో టీవీని ఫ్రీగా చూడవచ్చు.
ఇప్పుడు రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ఉన్న వినియోగదారుల కోసం ఒక కొత్త ప్లాన్ ప్రకటించింది. Jio TV Plus Two in One అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ రూ.599కి అందుబాటులో ఉంది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు రూ.899, ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.999తో ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేయవచ్చు.
Jio TV Plus యాప్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ ప్లాన్‌తో డబుల్ బెనిఫిట్ లభిస్తుంది. దీంతో పాటు మీరు 800 డిజిటల్ టీవీ ఛానెల్‌లు, 13 ప్రముఖ OTT యాప్‌లకు యాక్సెస్ పొందుతారు.
కాబట్టి.. మీరు Jio TV Plus యాప్ ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. 10 భాషల్లో 20 క్యాటగిరిలో 800 ఛానెల్‌లు, ఒకే లాగిన్‌తో 13 OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ ఉంటుంది.
టూ-ఇన్-వన్ ఆఫర్‌లోని మరో ప్రత్యేకత ఏమిటంటే... ఒకే కనెక్షన్ నుండి రెండు టీవీలను ఆన్ చేయవచ్చు. Jio Air Fiber కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఈ ఆఫర్ ద్వారా తమకు నచ్చిన ఛానెల్‌ని రెండు టీవీల్లో చూడవచ్చు. ఒకే కుటుంబంలో వేర్వేరు షోలను చూసే వారికి ఈ ఆఫర్ ప్రయోజనం చేకూరుస్తుంది. Jio TV Plus యాప్‌ని ప్రస్తుతం ఉన్న అన్ని స్మార్ట్ టీవీల్లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత అన్ని ఆప్షన్స్ లోడ్ అవుతాయి.
క్యాచ్ ఆన్ టీవీ ఫీచర్‌ని ఉపయోగించి, ప్రస్తుతం ప్రసారమయ్యే ప్రోగ్రామ్‌లను మాత్రమే కాకుండా గతంలో ప్రసారమైన ప్రోగ్రామ్‌లను కూడా చూడవచ్చు. వ్యక్తిగత ఆసక్తి ఆధారంగా ఛానెల్‌లు, షోలు, సినిమాలను సిఫార్సు చేస్తుంది. పిల్లల కోసం చైల్డ్ సేఫ్ సెక్షన్ కూడా అందించారు.
ఈ Jio TV Plus యాప్ ద్వారా మీరు వార్తలు, క్రీడలు, మ్యూజిక్, బిజినెస్, ఎంటర్టైన్మెంట్, భక్తి వంటి అన్ని ఛానెళ్లను చూడవచ్చు. పోగో, కార్టూన్ నెట్‌వర్క్, డిస్కవరీ కిడ్స్ లాంటి పిల్లలకు ఇష్టమైన ఛానెల్స్ కూడా ఉన్నాయి.
టూ-ఇన్-వన్ ఆఫర్‌ను పొందడానికి, మీరు మీ స్మార్ట్ టీవీ యాప్ స్టోర్ నుంచి జియో టీవీ ప్లస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు మీ రిజిస్టర్డ్ జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి.. ఈ ఆఫర్ అందించే సేవలను పొందవచ్చు.