10 నిమిషాల్లోనే 100% ఛార్జింగ్ ... మార్కెట్ లో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

First Published | Aug 26, 2024, 7:59 PM IST

 ఆధునిక జీవిత అవసరాలకు అనుగుణంగా సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. నిమిషాల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసే స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాంటి టాప్ 5 మొబైల్స్‌ ఇవే...

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్లు

ప్రస్తుత టెక్ జమానాలో ఏ పని అయినా క్షణాల్లో జరిగిపోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు. అలాంటిది ఫోన్ ఛార్జింగ్ కోసం గంటలకు గంటలు ఎవరు వేచివుంటారు. దీన్ని గుర్తించిన మొబైల్స్ తయారీ కంపనీలు కూడా క్షణాల్లో చార్జ్ అయ్యే సూపర్ ఫాస్ట్ బ్యాటరీలు, చార్జర్ తో కూడిన ఫోన్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. 

బడ్జెట్ ధరల్లోనే రికార్డ్ సమయంలో చార్జింగ్ అయ్యే ఫోన్లు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. వేగంగా చార్జింగ్ కావడమే కాదు అత్యధిక సమయం నిలిచివుంటుంది. మీరు నిత్యం ప్రయాణాలు చేస్తుంటారా? లేదా ఉద్యోగ, వ్యాపార పనులపై ఎక్కువసమయం బయటే వుంటారా?  అయితే మీకు మంచి బ్యాటరీ లైఫ్ వుండే ఫోన్లు చాలా అవసరం. అలాంటి టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే..

Realme GT5 Pro

1. రియల్‌మీ GT5 ప్రో

సెప్టెంబర్ 2023లో లాంచ్ అయిన రియల్‌మీ GT5 వేగంగా ఛార్జింగ్ అయ్యే మొబైల్ ఫోన్. ఇది రెండు ఛార్జింగ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒకటి రియల్‌మీ GT5 150W అయితే ఇంకోటి రియల్‌మీ GT5 240W. ఇందులో 240W మోడల్ కేవలం 80 సెకన్లలో 1% నుండి 20% వరకు ఛార్జ్ అవుతుంది. 100% ఛార్జ్ కావడానికి కేవలం 10 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది.


Redmi Note 12 Explorer

2. రెడ్‌మీ నోట్ 12

రెడ్‌మీ నోట్ 12 ఎక్స్‌ప్లోరర్ 210W అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 4,300 mAh బ్యాటరీని 9 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయడంలో సహాయపడుతుంది.

OnePlus 10T

3. వన్‌ప్లస్ 10T

వన్‌ప్లస్ 10T మరొక ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్. ఇది 150W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 4,800 mAh బ్యాటరీని 18 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయడంలో సహాయపడుతుంది.

Xiaomi 14 Pro

4. Xiaomi 14 ప్రో

Xiaomi 14 ప్రో అనేది 120W ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్‌ని అందించే మొబైల్ ఫోన్‌లలో ఒకటి. ఇది సగటున 22 నుండి 27 నిమిషాల్లో బ్యాటరీని 100% ఛార్జ్ చేయడంలో సహాయపడుతుంది.

Motorola Edge 40

5. మోటరోలా ఎడ్జ్ 40

మోటరోలా ఎడ్జ్ 40 ప్రో స్మార్ట్‌ఫోన్ 125W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కేవలం 23 నిమిషాల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తుంది.  

Latest Videos

click me!