జియో ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై బంపర్ క్యాష్‌బ్యాక్.. కానీ వన్ కండిషన్..

Ashok Kumar   | Asianet News
Published : Nov 18, 2021, 06:01 PM IST

భారతదేశంలోని అధిక జనాభా రిలయన్స్ జియో(reliance jio) సేవలను ఉపయోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు రిలయన్స్ జియో కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌లు, రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువస్తూనే ఉంది. తాజాగా బంపర్ క్యాష్‌బ్యాక్ (cashback)అందించే జియో ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌(recharge plan)ల గురించి మీకోసం. ఈ ప్లాన్‌తో మీరు డేటాతో పాటు ఎన్నో ఇతర ప్రయోజనాలను పొందుతారు.

PREV
14
జియో ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై బంపర్ క్యాష్‌బ్యాక్.. కానీ వన్ కండిషన్..

ఈ ప్రత్యేక ఆఫర్‌ను రిలయన్స్ జియో ప్రారంభించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లను కొనుగోలు చేసిన వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. అయితే మీరు కొన్ని జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లపై మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ పొందుతారు. అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లపై క్యాష్‌బ్యాక్ పొందలేరు. రిలయన్స్ జియో  ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను చాలా మంది కస్టమర్‌లు సద్వినియోగం చేసుకుంటున్నారు. బంపర్ క్యాష్‌బ్యాక్ అందిస్తున్న జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం...

24

మీరు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మీరు మై జియో (MyJio)యాప్‌ నుండి రీఛార్జ్ చేసుకోవాలి. మీరు ఏదైనా ఇతర  యాప్స్ నుండి రీఛార్జ్ చేసుకుంటే మీకు ఈ క్యాష్‌బ్యాక్ లభించదు. మీరు మై జియో యాప్‌తో రూ. 249 రీఛార్జ్ చేసుకుంటే మీరు రూ. 50 క్యాష్‌బ్యాక్ పొందుతారు. దీనిని మీరు జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, జియో రీఛార్జ్ మొదలైన వాటిలో ఉపయోగించవచ్చు. 
 

34

మరోవైపు మీరు రూ.555 రీఛార్జ్ చేస్తే మీకు రూ.111 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీరు జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, జియో రీఛార్జ్ కోసం కూడా ఈ క్యాష్‌బ్యాక్‌ని ఉపయోగించవచ్చు.

44

మీరు రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీఛార్జ్ చేస్తే మీకు రూ. 120 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లన్నింటిపై డేటా, ఆన్ లిమిటెడ్ కాల్స్ పొందుతారు. అంతేకాకుండా మీకు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్ మొదలైన వాటి సబ్ స్క్రిప్షన్ కూడా వస్తుంది. కంపెనీ ఈ ఆఫర్‌కి జియో మార్ట్ మహా క్యాష్ బ్యాక్ అని పేరు పెట్టింది.

click me!

Recommended Stories