ఏంటంటే ఎప్పుడు జియో కస్టమర్లకు ఒక నెల వాలిడిటీని ఉచితంగా అందిస్తుంది. జియో రూ. 2,545 ప్రీ-పెయిడ్ ప్లాన్ ఇప్పుడు కొత్త మార్పుతో ముందుకు వచ్చింది. దానితో పాటు హ్యాపీ న్యూ ఆఫర్ గురించి తెలుసుకుందాం...
హ్యాపీ న్యూ ఇయర్ 2022 ఆఫర్
డిసెంబర్ 1న రిలయన్స్ జియో రిచార్జ్ ప్లాన్లను అప్ డేట్ చేసింది దీంతో ఒక సంవత్సరం వ్యాలిడిటీగల ప్రీ-పెయిడ్ ప్లాన్ రూ.2545ను మార్పు చేసింది. ప్రస్తుతం ఈ ప్లాన్‌తో కస్టమర్‌లు 336 రోజుల వాలిడిటీని పొందుతున్నారు, అయితే హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కింద ఈ ప్లాన్ వాలిడిటీ ఇప్పుడు 365 రోజులకు పెంచబడింది అంటే ఈ ప్లాన్ వాలిడిటీ అదనంగా మరో 29 రోజులు పెరిగింది. జియో ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే, అయితే ఈ ప్లాన్‌ని రీఛార్జ్ చేయడానికి చివరి తేదీ ఎప్పుడు అనే దాని గురించి కంపెనీ అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, అయితే ఒక నివేదిక ప్రకారం, ఈ ప్లాన్ 2 జనవరి 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.