అతిపెద్ద సెర్చ్ ఇంజన్ గూగుల్ పై రష్యా భారీ జరిమానా.. కారణం ఏంటో తెలుసా..?

First Published Dec 25, 2021, 12:41 PM IST

చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించడంలో పదేపదే విఫలమైనందుకు ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు రష్యన్ కోర్టు శుక్రవారం భారీ జరిమానా విధించింది.  విదేశీ టెక్ సంస్థలపై అధికారులు అణిచివేతను పెంచుతున్న తరుణంలో ఇది అతి పెద్ద జరిమానా.

మాస్కో కోర్టు నిషేదిత కంటెంట్‌ను తీసివేయాలనే ఆదేశాలను పాటించడంలో కంపెనీ పదేపదే విఫలమైందని పేర్కొంది. అయితే గూగుల్ ఆదాయం ఆధారంగా జరిమానాను లెక్కించినట్లు తెలిపింది. గూగుల్ ఈ తీర్పును అధ్యయనం చేస్తోంది అలాగే తదుపరి దశలను పటిస్తుందని మాస్కోలోని కంపెనీ ప్రెస్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది.


రష్యా  డిజిటల్ సావారెంటీని సమర్థించే ప్రచారాన్ని ప్రభుత్వం ఈ సంవత్సరం విదేశీ సోషల్ మీడియా, ఇంటర్నెట్ కంపెనీలతో  ఘర్షణను వేగవంతం చేసింది. అనధికార నిరసనలను ప్రోత్సహించే పోస్ట్‌లను, చట్టవిరుద్ధమని భావించే విషయాలను తొలగించమని గూగుల్, ట్విట్టర్ తో సహా కంపెనీలను బలవంతం చేసే ప్రయత్నంలో రెగ్యులేటర్స్ జరిమానాలు విధించారు.


డేటా స్టోరేజ్ లోకలైజేషన్ పై పెరుగుతున్న కఠినమైన చట్టాలకు అనుగుణంగా ప్రభుత్వం టెక్ కంపెనీలను కూడా ఒత్తిడి చేస్తోంది. ఈ సంవత్సరం  పార్లమెంట్ ఎన్నికల సమయంలో గూగుల్, ఆపిల్ స్థానిక సిబ్బందిని బందీస్తామని  అధికారులు బెదిరించడంతో  రష్యన్ స్టోర్‌ల నుండి ప్రొటెస్ట్-ఓటింగ్ యాప్‌ను తొలగించారు.


అయితే తాజా తీర్పు వరకు కంటెంట్‌ని తొలగించడంలో విఫలమైనందుకు జరిమానాలు సాధారణంగా తక్కువగా ఉండేవి. కానీ కంటెంట్‌ను తొలగించని కంపెనీలు  వారి వార్షిక స్థానిక ఆదాయంలో 5% నుండి 20% వరకు జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుందని సెప్టెంబరులో రష్యా  ఫెడరల్ కమ్యూనికేషన్స్ వాచ్‌డాగ్ తెలిపింది.

స్పార్క్-ఇంటర్‌ఫాక్స్ డేటాబేస్ ప్రకారం, 2020లో గూగుల్ రష్యాలో దాదాపు 85 బిలియన్ రూబిళ్లు ఆదాయాన్ని ఆర్జించింది."కొన్ని కారణాల వల్ల, కంపెనీ అమెరికన్ అండ్ యూరోపియన్ కోర్టుల నిర్ణయాలను పాటిస్తుంది" అని ఇన్ఫర్మేషన్ పాలసీ కమిటీలోని అంటోన్ గోరెల్కిన్ శుక్రవారం టెలిగ్రామ్‌లో  పోస్ట్ చేశారు.  శుక్రవారం నాటి తీర్పు రష్యాలో గూగుల్ కి తాజా చట్టపరమైన ఎదురుదెబ్బ.
 

click me!