జియో ఒక నెల ప్లాన్ ధర రూ. 259. ఈ ప్లాన్ తో మీకు ఒక నెల పూర్తి వాలిడిటీ పొందుతారు, అంటే మీరు ఏప్రిల్ 1వ తేదీన రీఛార్జ్ చేసుకుంటే, మీరు తదుపరి రీఛార్జ్‌ను మే 1వ తేదీన మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో కస్టమర్‌లు ప్రతిరోజూ 1.5 GB డేటాను పొందుతారు. అంతేకాకుండా అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. మీరు ఈ ప్లాన్‌ని ఒకే సమయంలో అనేక సార్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రతి నెల వాలిడిటీ గడువు ముగిసిన తర్వాత, కొత్త ప్లాన్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 100 SMSలు కూడా లభిస్తాయి. ఈ ప్లాన్‌తో కూడా ఇతర ప్లాన్‌ల లాగానే Jio అన్ని యాప్‌లు సబ్‌స్క్రైబ్ పొందవచ్చు.