Alert: గూగుల్ క్రోమ్, మొజిల్ల ఫైర్ ఫాక్స్ బ్రౌజర్‌లకు ప్రభుత్వం హై లెవెల్ హెచ్చరిక జారీ..

First Published | Jun 13, 2022, 12:08 PM IST

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్, మొజిల్లా బ్రౌజర్‌లకు సంబంధించి ఉన్నత స్థాయి హెచ్చరికను జారీ చేసింది. క్రోమ్, మొజిల్లాలోని లోపాలు యూజర్ పర్సనల్ డేటాను హ్యాకర్లకు పంపవచ్చని CERT-In తెలిపింది. ఏజెన్సీ ప్రకారం, ఈ బగ్  అన్ని రకాల సెక్యూరిటి కూడా దాటవేయవచ్చు.
 

CERT-In ప్రకారం, 96.0.4664.209కి ముందు క్రోమ్ బ్రౌజర్ వెర్షన్ లో హ్యాకర్లు ప్రయోజనం పొందగల ఎన్నో బగ్‌లు ఉన్నాయి. ఈ బగ్‌లను Google CVE-2021-43527, CVE-2022-1489, CVE-2022-1633, CVE-202-1636, CVE-2022-1859, CVE-2022-18320 అండ్ C28-2022-18320గా గుర్తించింది. 

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అండ్ క్రోమ్ బ్రౌజర్‌లను వీలైనంత త్వరగా అప్‌డేట్ చేయాలని ఏజెన్సీ యూజర్లను కోరింది. Mozilla Firefox iOS 101కి ముందు వెర్షన్ లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మొజిల్లా ఈ సమస్యలు హై లెవెల్ బగ్‌ల క్యాటగిరిలో  చేర్చింది.

ఈ బగ్‌ని పరిష్కరించడానికి మొజిల్లా కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ iOS 101, మొజిల్లా ఫైర్‌ఫాక్స్  Thunderbird వెర్షన్ 91.10, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ESR వెర్షన్ 91.10 అండ్ మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వెర్షన్ 101ని డౌన్‌లోడ్ చేసుకోవాలని కంపెనీ యూజర్లను కోరింది.

Latest Videos


CERT-In ప్రకారం, మొజిల్లా అండ్ క్రోమ్ బ్రౌజర్‌లలో ఈ బగ్‌ల కారణంగా డేనైయల్ సర్వీస్ (DoS) దాడికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ దాడిలో యూజర్  సమాచారాన్ని యాక్సెస్ చేయలేరు, అయితే హ్యాకర్ యూజర్ ఇ-మెయిల్ ఐడి, వెబ్‌సైట్ అండ్ ఇతర అక్కౌంట్స్ గురించి సమాచారాన్ని పొందవచ్చు.

గత నెలలో కూడా CERT-in గూగుల్ క్రోమ్ కి సంబంధించి హెచ్చరిక జారీ చేసింది. గూగుల్ క్రోమ్‌లో బగ్ ఉందని, దాని అవకాశంగా తీసుకొని హ్యాకర్లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చని ఏజెన్సీ తెలిపింది. CERT-In ప్రకారం, Google Chrome వెర్షన్ 100లో చాలా ప్రమాదకరమైన సెక్యూరిటి బగ్ ఉంది.

click me!