భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతదేశ వ్యక్తుల ఫోన్‌లపై నిఘా పెట్టడానికి పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించారని పలు మీడియా సంస్థలు పేర్కొన్న తరువాత ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇప్పుడు ఈ ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చింది.
undefined
ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని సోమవారం తెలిపింది. ఈ ప్రకటనలో పారిస్‌కు చెందిన వార్తాపత్రిక ఫర్బిడెన్ కధనాలు పూర్తిగా అబద్దం, తప్పుదోవ పట్టించే ఆరోపణలు అని ఇంకా చాలా సందేహాలకు కారణమవుతోంది అని వెల్లడించింది. నివేదికలో చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఎన్ఎస్ఓ గ్రూప్ దీనికి సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడం కూడా ఈ కథనాలు తప్పు అని ఇందులో వాస్తవం లేదని రుజువు చేస్తుందని సూచించింది.
undefined
ఈ వాదనలు "హెచ్‌ఆర్‌ఎల్ లుక్అప్ సర్వీసెస్ వంటి అక్సెస్ చేయగల ప్రాథమిక సమాచారం డేటా తప్పుదోవ పట్టించే కధనాల ఆధారంగా ఎవరికైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగంగా లభిస్తాయి. సాధారణంగా ప్రభుత్వ సంస్థలు ఇంకా ప్రైవేట్ కంపెనీలు వివిధ కారణాల వల్ల దీనిని ఉపయోగిస్తాయి" అని కంపెనీ పేర్కొంది.
undefined
డేటా లీక్ వాదనలు పూర్తిగా అబద్ధమని, అలాంటి డేటా మా సర్వర్లలో ఎప్పుడూ నిల్వ చేయలేదని, అలాగే పైన పేర్కొన్న కొన్ని దేశాలకు పెగాసిస్‌కు అక్సెస్ లేదని కంపెనీ తెలిపింది. నేరాలు, ఉగ్రవాద చర్యలను నివారించి ప్రాణాలను కాపాడటానికి పెగసాస్ టెక్నాలజి లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు మాత్రమే విక్రయించబడుతుందని ఇజ్రాయెల్ సంస్థ పునరుద్ఘాటించింది.
undefined
ఇద్దరు కేంద్ర కేబినెట్ మంత్రులు, ముగ్గురు ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ అధికారులు, 40 మంది జర్నలిస్టులతో సహా సుమారు 300 మంది భారతీయులపై నిఘా పెట్టడానికి పెగసాస్ స్పైవేర్ ఉపయోగించినట్లు ఫర్బిడెన్ స్టోరీస్ అండ్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆదివారం పేర్కొన్న తరువాత ఈ ప్రకటన జరిగింది.డేటాబేస్ లీక్ కి ఉటంకిస్తూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 50వేల మంది ఫోన్లు స్పైవేర్ ఉపయోగించి లక్ష్యంగా పెట్టుకున్నాయని నివేదిక పేర్కొంది.
undefined