99 శాతం మందికి ఇది తెలిసి ఉండదు.. iPhoneలో ‘i’ అక్షరానికి అసలు అర్థం ఏంటి?

Published : Jun 05, 2026, 03:44 PM IST

iPhone: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్లలో iPhone ఒకటి. అయితే ఐఫోన్‌ను ఎన్నేళ్లుగా ఉపయోగిస్తున్న చాలా మందికి కూడా ఒక విషయం తెలియదు. యాపిల్ ప్రొడ‌క్ట్స్ పేర్ల ముందు ఉండే చిన్న ‘i’ అక్షరం అర్థం ఏంటో తెలిసి ఉండ‌దు. 

PREV
15
‘i’ అక్షరం కథ ఎప్పుడు మొదలైంది.?

ఈ కథ 1998లో ప్రారంభమైంది. ఆ సమయంలో యాపిల్‌ తన తొలి iMac కంప్యూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఆ ఉత్పత్తిని పరిచయం చేసిన సందర్భంగా అప్పటి యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్ ఈ పేరులోని ‘i’ అక్షరానికి ఉన్న అర్థాన్ని వివరించారు. ఆ రోజుల్లో ఇంటర్నెట్ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తోంది. ప్రజలు సులభంగా ఇంటర్నెట్‌ను ఉపయోగించేందుకు అనువైన కంప్యూటర్‌ను రూపొందించాలనే ఉద్దేశంతో యాపిల్‌ పనిచేసింది. అందుకే iMacలోని ‘i’ ప్రధానంగా ఇంట‌ర్నెట్‌ అనే పదాన్ని సూచిస్తుందని స్టీవ్ జాబ్స్ చెప్పారు.

25
‘i’ అంటే కేవలం ఇంట‌ర్నెట్‌ మాత్రమే కాదు

చాలా మంది ‘i’ అంటే కేవలం ఇంట‌ర్నెట్‌ అని మాత్రమే అనుకుంటారు. కానీ స్టీవ్ జాబ్స్ ప్రకారం ఈ అక్షరానికి మరికొన్ని ముఖ్యమైన అర్థాలు కూడా ఉన్నాయి. అవి Apple ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తాయి. యాపిల్ ఉత్పత్తులు కేవలం టెక్నాలజీ పరికరాలు మాత్రమే కాకుండా, వినియోగదారుల జీవితాలను సులభతరం చేయడం, వారికి కొత్త అవకాశాలు అందించడం లక్ష్యంగా రూపొందించామ‌ని ఆయన వివరించారు.

Individual – ప్రతి వ్యక్తి కోసం రూపొందించిన పరికరం

‘i’లోని మరో అర్థం Individual. అంటే వ్యక్తిగత అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన పరికరం. ప్రతి వినియోగదారుడు తనకు నచ్చిన విధంగా ఉపయోగించుకునేలా యాపిల్‌ ఉత్పత్తులను డిజైన్ చేస్తుంది. అందుకే iPhone, iPad వంటి పరికరాలను వ్యక్తిగత అనుభవాన్ని అందించేలా రూపొందించారు.

35
Inform, Instruct – సమాచారం, నేర్చుకునే అవకాశం

స్టీవ్ జాబ్స్ చెప్పిన మరో రెండు అర్థాలు ఇన్‌ఫామ్‌, ఇన్‌స్ట్ర‌క్ట్. ఇన్ఫామ్ అంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని సులభంగా వినియోగదారుల చేతికి చేర్చడం. ఇంటర్నెట్ ద్వారా వార్తలు, విద్య, వ్యాపారం, వినోదం వంటి అనేక విషయాలను అందుబాటులోకి తీసుకురావడమే దీని ఉద్దేశం. Instruct అంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, జ్ఞానం పెంచుకోవడానికి సాంకేతికతను ఉపయోగించడం. Apple పరికరాలను విద్య, పరిశోధన, నైపుణ్యాల అభివృద్ధికి ఉపయోగపడేలా రూపొందించారు.

45
Inspire – సృజనాత్మకతకు ప్రేరణ

‘i’లో చివరి ముఖ్యమైన అర్థం Inspire. అంటే వినియోగదారులను కొత్త ఆలోచనలు చేయడానికి, సృజనాత్మకంగా పనిచేయడానికి ప్రేరేపించడం. Apple ఉత్పత్తులు కేవలం కమ్యూనికేషన్ లేదా వినోదానికి మాత్రమే కాకుండా, ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, డిజైన్, సంగీతం వంటి రంగాల్లో కొత్త సృజనాత్మక అవకాశాలను అందిస్తున్నాయి. అందుకే ఈ ‘i’ అక్షరం క్రమంగా Apple బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపుగా మారింది.

55
నేటి Apple బ్రాండ్‌లో ‘i’ ప్రాధాన్యం

ప్రస్తుతం iPhone, iPad, iMac వంటి ఉత్పత్తుల పేర్లలో ఉన్న ‘i’ అక్షరం కేవలం ఒక అక్షరం మాత్రమే కాదు. అది Apple బ్రాండ్ తత్వాన్ని, సాంకేతికతపై సంస్థ దృష్టిని సూచించే గుర్తుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను ఆకర్షించడంలో ఈ బ్రాండ్ గుర్తింపుకూ కీలక పాత్ర ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories