iPhone Offers: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. కేవలం రూ. 40 వేలకే ఐఫోన్ 16.. ఒరిజినల్ ఛార్జర్ కూడా ఫ్రీ బాసూ !

Published : Jun 05, 2026, 07:48 AM IST

iPhone Offers: క్రోమా ఎవ్రీథింగ్ ఆపిల్ సేల్‌లో ఐఫోన్ 16 భారీ డిస్కౌంట్‌తో రూ. 40041 కే లభిస్తోంది. దీనితో పాటు రూ. 2190 విలువైన ఛార్జర్ ఉచితంగా అందిస్తున్నారు. ఈ క్రేజీ ఆఫర్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఐఫోన్ల పై అదిరిపోయే ఆఫర్లు

ఆపిల్ ప్రొడక్ట్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఐఫోన్ కొనాలని ప్రతి ఒక్కరికీ ఒక కల ఉంటుంది. కానీ, దాని ధరలు చూసి చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ దిగ్గజం క్రోమా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. 

క్రోమా ప్లాట్‌ఫామ్‌పై ప్రస్తుతం ఎవ్రీథింగ్ ఆపిల్ అనే ప్రత్యేక క్యాంపెయిన్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఆపిల్ ఐఫోన్ 16 (128GB) మోడల్‌పై ఊహించని రేంజ్‌లో డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అన్ని ఆఫర్లు కలుపుకుంటే ఈ ఫోన్‌ను కేవలం రూ. 40,041 కే సొంతం చేసుకోవచ్చు.

ఈ క్రేజీ సేల్ మే 29న ప్రారంభం కాగా, జూన్ 14 వరకు అందుబాటులో ఉంటుంది. కేవలం ఐఫోన్లు మాత్రమే కాదు.. మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్, ఎయిర్‌పాడ్స్, ఆపిల్ వాచ్‌లపై కూడా క్రోమా భారీగా ధరలను తగ్గించింది. ఆపిల్ లవర్స్‌కు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

25
రూ. 40,041 కే ఐఫోన్ 16 ఎలా వస్తుందంటే?

చాలా మందికి ఐఫోన్ 16 ఇంత తక్కువ ధరకు ఎలా వస్తుందనే డౌట్ రావచ్చు. క్రోమా ఈ ఆఫర్‌ను ఒకే ఫ్లాట్ డిస్కౌంట్ రూపంలో ఇవ్వడం లేదు. దీని కోసం మల్టిపుల్ బెనిఫిట్స్‌ను క్లబ్ చేసింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, స్పెషల్ ప్రమోషన్లు, డిస్కౌంట్ కూపన్లు, టాటా నియో రివార్డ్స్.. వీటన్నింటినీ కలిపి ఈ ఎఫెక్టివ్ ప్రైస్‌ను ఆఫర్ చేస్తోంది. 

మీ పాత ఫోన్ కండిషన్ బాగుండి, గరిష్ఠ ఎక్స్ఛేంజ్ వాల్యూ వస్తే.. ఐఫోన్ 16 ఫైనల్ ప్రైస్ భారీగా తగ్గుతుంది. మీరు ఆపిల్ పాత యూజర్ అయినా లేదా ఆండ్రాయిడ్ నుండి ఆపిల్ వరల్డ్‌లోకి ఎంటర్ అవ్వాలనుకునే కొత్త యూజర్ అయినా.. జేబుకు చిల్లు పడకుండా ఐఫోన్ 16 కొనేందుకు ఇది బెస్ట్ టైమ్.

35
రూ. 2,190 విలువైన ఆపిల్ ఛార్జర్ ఉచితం

ఈ సేల్‌లో మరో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే.. క్రోమా కేవలం ఫోన్ ధరను తగ్గించడమే కాకుండా, ఒక అదిరిపోయే ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తోంది. ఐఫోన్ 16 కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 2,190 విలువైన అఫీషియల్ ఆపిల్ పవర్ అడాప్టర్ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది.

ఆపిల్ సంస్థ బాక్స్‌లో ఛార్జర్ ఇవ్వడం ఆపేసి చాలా కాలం అయింది. బయట విడిగా ఛార్జర్ కొనాలంటే అదనపు భారం పడుతుంది. కానీ క్రోమా ఆఫర్ వల్ల ఆ డబ్బులు ఆదా అవుతాయి. ఈ ఉచిత ఛార్జర్ ఆఫర్ కేవలం ఐఫోన్ 16కే కాదు.. ఈ సేల్‌లో ఐఫోన్ 15 లేదా ఐఫోన్ 17 కొన్నా కూడా వర్తిస్తుంది.

45
ఐఫోన్ 15, ఐఫోన్ 17 లపై కూడా భారీ తగ్గింపులు

క్రోమా 'ఎవ్రీథింగ్ ఆపిల్' సేల్‌లో కేవలం ఐఫోన్ 16 మాత్రమే కాదు.. ఇతర మోడల్స్ పై కూడా సూపర్ డీల్స్ ఉన్నాయి.

• ఐఫోన్ 15 (128GB): అన్ని ఆఫర్లతో కలిపి కేవలం రూ. 36,891 ప్రారంభ ధరకే లభిస్తోంది.

• ఐఫోన్ 17 (256GB): ఈ లేటెస్ట్ మోడల్ కేవలం రూ. 44,768 ల్యాండింగ్ ప్రైస్ నుండి అందుబాటులో ఉంది.

వీటితో పాటు ఆపిల్ మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్, ఎయిర్‌పాడ్స్, ఆపిల్ వాచ్ మోడల్స్‌పై కూడా క్రోమా క్రేజీ ప్రైస్ కట్స్ ప్రకటించింది. గ్యాడ్జెట్స్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైమ్ అని చెప్పొచ్చు.

55
జూన్ 14 వరకే ఛాన్స్.. మిస్ అవ్వకండి!

ఈ అద్భుతమైన ఆఫర్లు జూన్ 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని క్రోమా స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఎక్స్ఛేంజ్ చేసే పాత ఫోన్ మోడల్, మీ లొకేషన్‌లోని క్రోమా స్టోర్ స్టాక్ లభ్యత, మీ సిటీని బట్టి ఫైనల్ ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే మీకు దగ్గరలోని క్రోమా స్టోర్‌ను విజిట్ చేయండి లేదా క్రోమా అఫీషియల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ డీల్‌ను ఇప్పుడే బుక్ చేసుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories