సూపర్ అఫర్.. తక్కువ ధరకే ఐఫోన్ 15.. జస్ట్ ఈ ఫోన్ నుంటే చాలు..

First Published | Dec 2, 2023, 4:41 PM IST

ఆపిల్ ఫ్లాగ్‌షిప్ డివైజ్ ఐఫోన్ 15  కొద్ది నెలల క్రితం రూ. 79,900 ధరతో లాంచైనా సంగతి మీకు తెలిసిందే, అయితే ఇప్పుడు నమ్మశక్యం కాని తగ్గింపు ధర రూ. 50,000 కంటే తక్కువకే లభిస్తోంది. 

సెప్టెంబరులో గొప్పగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి iPhone 15 కొన్ని ఆన్‌లైన్ సేల్స్  లో  కనిపించింది,  తాజాగా కస్టమర్లకు ఆపిల్ లేటెస్ట్ ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. అయితే ప్రస్తుత ఆఫర్ లైవ్ సేల్ లేనప్పటికీ ఐఫోన్ 15ని రూ. 50,000 కంటే తక్కువకు సొంతం చేసుకునే ఛాన్స్ తీసుకొచ్చింది.

నెక్స్ట్ అఫీషియల్  సేల్  రానుండగా ఐఫోన్ 15 కొనాలనుకునే వారికీ  ఇప్పుడు ఊహించలేని ధరకే  కొనుగోలు చేసే డీల్ తో వచ్చింది. ప్రముఖ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ అయిన Amazon , ప్రస్తుతం ఇటీవల విడుదల చేసిన iPhone 15ని రూ. 50,000 కంటే తక్కువ ధరకు అందిస్తోంది. అయితే, మీరు కొనుగోలు చేయడానికి ముందు ఒక ముఖ్యమైన విషయం ఉంది. 

 Amazon ఆఫర్ కింద, మీరు మీ iPhone 14 Proని ఎక్స్ఛేంజ్ చేయాల్సీ ఉంటుంది. దింతో లేటెస్ట్  iPhone 15ని రూ. 45, 400 తగ్గింపు ధరకు పొందవచ్చు. అయితే  iPhone 14 Pro Max పై రూ. 34,500 ఎక్స్ఛేంజ్ వాల్యూ సెట్ చేసింది. ఈ వాల్యూ  14 Pro Max   అన్ని స్టోరేజ్ మోడల్‌లలో ఒకే విధంగా ఉంటుంది.  
 


ఐఫోన్ 14 ప్రో  లేటెస్ట్ ఫీచర్లు ఇంకా ప్రీమియం స్పెసిఫికేషన్‌లకు ప్రసిద్ధి చెందింది,  ఐఫోన్ 15  బేస్ వేరియంట్ చాలా ఎక్కువ ధర ఉంటుంది. ఐఫోన్ 15 నిస్సందేహంగా కొన్ని మెరుగుదలను తెస్తుంది. 

iPhone 14 Pro Max స్పెసిఫికేషన్లు: దీనిని సెప్టెంబర్ 2022లో ప్రారంభించారు, iPhone 14 Pro Max 6.70-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్‌ ఉంది, 2796×1290 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 460 పిక్సెల్‌లు (ppi), హెక్సా-కోర్ Apple A16 బయోనిక్ ప్రాసెసర్‌తో  వైర్‌లెస్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.  48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ డ్యూయల్ 12-మెగాపిక్సెల్ లెన్స్‌  ఉన్న బ్యాక్   ట్రిపుల్-కెమెరా సెటప్‌ను పొందుతారు,  12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో iOS 16లో రన్ అవుతోంది, స్టోరేజ్ ఆప్షన్‌లు 128GB నుండి  1TB వరకు ఉంటాయి. ఐఫోన్ 14 ప్రో  మ్యాక్స్ ధర రూ.1,27,999 నుండి మొదలవుతుంది. 

iPhone 15 స్పెసిఫికేషన్లు: iPhone 15 ముందు ఇంకా  వెనుక భాగంలో కార్నింగ్ మేడ్ గ్లాస్, అల్యూమినియం ఫ్రేమ్ అండ్ డ్యూయల్ సిమ్ తో  కూడిన అధునాతన డిజైన్‌ ఉంది. సిరామిక్ షీల్డ్ గ్లాస్ అండ్  HDR10తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే  ఉంది,  శక్తివంతమైన Apple A16 బయోనిక్ చిప్‌సెట్‌తో నడుస్తుంది. 128GB నుండి 512GB వరకు స్టోరేజ్  అప్షన్లతో 12 MP సెల్ఫీ కెమెరాతో పాటు డ్యూయల్ 48 MP అండ్  12 MP ప్రధాన కెమెరా సెటప్‌  ఉంది. కనెక్టివిటీలో డిస్‌ప్లేపోర్ట్‌తో Wi-Fi 802.11 a/b/g/n/ac/6, బ్లూటూత్ 5.3, NFC ఇంకా  USB టైప్-C 2.0 ఉన్నాయి. ఐఫోన్  15  రూ.77490 నుండి ఉంటుంది. 

Latest Videos

click me!