కనెక్టివిటీని ప్రోత్సహించడానికి ఆలోచనలు, వీడియోలు ఇంకా ఫోటోలను అందరితో షేర్ చేసుకునే స్టేటస్ అప్‌లోడ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ యాప్ వ్యక్తిగత ఉపయోగం కోసం ఒక అప్లికేషన్ కానీ ప్రొఫెషనల్ స్పేస్‌లో అవసరాలను కనుగొంది. ఇంకా ఇప్పుడు ప్రైవేట్ మెసేజింగ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల మిశ్రమంగా ఉపయోగించబడుతుంది.
అయినప్పటికీ, వాట్సాప్‌లో ఎన్నో స్కామ్‌లు ఇంకా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిందని, వినియోగదారులపై నిఘా పెడుతుందని ఆరోపించబడటంతో, మీరు తప్పనిసరిగా తెలుసుకోవలసిన కొన్ని ప్రైవసీ అండ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. వీటి ద్వారా మీ డేటాను సురక్షితంగా, చాట్‌లను ప్రైవేట్‌గా ఉంచడంలో మీకు సహాయపడుతుంది.
ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్
ఈ ఫీచర్ యూజర్ల చాట్ ప్రారంభిస్తున్న వ్యక్తితో సురక్షిత కనెక్షన్‌ని ఏర్పాటు చేసుకున్నారని వెరిఫై చేయడానికి వీలు కల్పిస్తుంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ ప్రక్రియను 'కీ ట్రాన్స్‌పరెన్సీ' అని పిలుస్తారు.
చాట్ లేదా కాల్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఖచ్చితం చేస్తుంది. దీని అర్థం ఏమిటంటే, మీరు ఎన్‌క్రిప్షన్ ట్యాబ్‌పై క్లిక్ చేసినప్పుడు, మీ పర్సనల్ చాట్ సురక్షితంగా ఉందని వెరిఫై చేయవచ్చు” అని వాట్సాప్‌లో ఒక బ్లాగ్ పేర్కొంది.
అకౌంట్ ప్రొటెక్షన్
మీరు కొత్త ఫోన్‌ని ఉపయోగిస్తే లేదా మరొక డివైజ్ నుండి మీ WhatsApp అకౌంట్ కి లాగిన్ చేస్తే నిజంగా అది మీరేనా లేదా మరెవరైననా అని డబల్ చెక్ చేస్తుంది.
మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కన్ఫర్మ్ చేయడానికి మీ పాత డివైజ్ వెరిఫై చేయమని వాట్సాప్ మిమ్మల్ని అడుగుతుంది. దీని ద్వారా మీ అకౌంట్ మరొక డివైజ్ లో ఉపయోగించడానికి అనధికార ప్రయత్నాన్ని ఆపడానికి కూడా మీకు సహాయపడుతుంది.
ఆన్ నౌన్ కాలర్ సైలెంట్
ఫేస్‌బుక్ పోస్ట్‌లో మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ, వాట్సాప్ వినియోగదారులు తెలియని నంబర్‌ల నుండి ఇన్‌కమింగ్ కాల్స్ ఆటోమేటిక్ గా సైలెంట్ చేయవచ్చు.
ఈ కాల్స్ మీ ఫోన్‌లో కనిపించవు లేదా మీ వర్క్ కి అంతరాయం కలిగించదు, కానీ మీరు వాటిని కాల్ లిస్ట్‌లో చూడవచ్చు. మీరు సెట్టింగ్‌కి వెళ్లి 'ఆన్ నౌన్ కాలర్ సైలెంట్ 'ని ఆన్ చేయవచ్చు.
డిసపియర్ మెసేజెస్
మీరు ప్రైవసీ సమాచారాన్ని షేర్ చేయడానికి WhastAppని ఉపయోగిస్తే, మీ డేటాను రక్షించడానికి 'డిసపియర్ మెసేజెస్ ' ఒక గొప్ప టూల్. మీరు దీన్ని చాట్ లో ఆన్ చేస్తే 24 గంటల్లో చాట్ మెసేజెస్ డేటా ఆటోమేటిక్ గా తొలగిస్తుంది.
చాట్ మెసేజెస్ లేకుండా చూసుకోవడానికి మీరు ఇప్పుడు దీన్ని గ్రూప్ చాట్‌లలో కూడా ఉపయోగించవచ్చు. ఇంకా ఒక వ్యక్తి సమాచారాన్ని లీక్ కాకుండా చేస్తుంది.
WhatsApp మని ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అప్లికేషన్‌ను లాక్‌లో ఉంచడం చాలా ముఖ్యం. 'సెట్టింగ్‌లు' ద్వారా, అప్లికేషన్ ఎంత సమయం ఓపెన్ ఉంటుందో మీరు నిర్ణయించవచ్చు. ఉదాహరణకు, మీరు టైమర్‌ను 5 నిమిషాలు సెట్ చేస్తే, అప్లికేషన్ ఓపెన్ చేసిన 5 నిమిషాల తర్వాత స్టాండ్‌బై మోడ్‌లోకి వెళుతుంది. మీరు దీన్ని మీ ఫేస్ లేదా టచ్ ఐడితో ఓపెన్ చేయవచ్చు.
టు-స్టెప్స్ వెరిఫికేషన్
మీరు అప్లికేషన్‌ను ఓపెన్ చేసి ఉపయోగించడం ప్రారంభిస్తే మీరు టు-స్టెప్స్ వెరిఫికేషన్ తో ప్రారంభిస్తారు. దీని ద్వారా మీ నంబర్ విజయవంతంగా రిజిస్టర్ చేసుకోవడానికి సహాయపడుతుంది. అంటే వేరొకరు మీ అకౌంట్ ఉపయోగించడానికి ప్రయత్నిస్తే, వారు రిజిస్టర్డ్ నంబర్‌కు పంపబడే ఆరు అంకెల కోడ్‌ను ఎంటర్ చేయాలి. అందువల్ల, ఒక వ్యక్తికి రిజిస్టర్డ్ నంబర్ ఉండకపోతే, వారు WhatsApp ఉపయోగించలేరు.