అలాగే, Google Pay ఏ కారణం చేతనైనా థర్డ్-పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని లేదా ఇన్‌స్టాల్ చేయమని ఎప్పుడూ అడగదని గుర్తుంచుకోవాలని Google వినియోగదారులను హెచ్చరిస్తుంది. అలాగే, ఈ యాప్‌లు డౌన్‌లోడ్ చేస్తే Google Payని ఉపయోగించే ముందు వాటిని క్లోజ్ చేసి ఉండేలా చూసుకోవాలి.
ఒకవేళ, ఎవరైనా Google Pay ప్రతినిధిగా వ్యవహరించి ఏదైనా యాప్‌లను డౌన్‌లోడ్ చేసి అన్‌ఇన్‌స్టాల్ చేసి వాటిని వెంటనే తొలగించమని మీకు సూచించినట్లయితే మీరు ఈ సమస్యను Google Payకి నివేదించవచ్చని కూడా Google చెబుతోంది.