ట్రావెలర్స్ కోసం ఇన్ఫినిక్స్ చౌకైన ల్యాప్‌టాప్‌.. దీని ధర ఎంత తక్కువ తెలుసా..

Ashok Kumar   | Asianet News
Published : Jun 16, 2022, 06:18 PM IST

ఇన్ఫినిక్స్ (Infinix) ఇండియాలో కొత్త ల్యాప్‌టాప్ Infinix InBook X1 స్లిమ్‌ను లాంచ్ చేసింది. Infinix InBook X1 Slim ప్రత్యేకంగా ల్యాప్‌టాప్‌తో ప్రయాణించాలనుకునే వారి కోసం రూపొందించారు. Infinix InBook X1 Slim బరువు 1.24 కిలోలు మాత్రమే. 

PREV
13
ట్రావెలర్స్ కోసం ఇన్ఫినిక్స్ చౌకైన ల్యాప్‌టాప్‌.. దీని ధర ఎంత తక్కువ తెలుసా..

ఈ ల్యాప్‌టాప్ మూడు ప్రాసెసర్‌లతో పరిచయం చేసారు, ఇందులో 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3, i5 అండ్ i7 ఉన్నాయి. Infinix InBook X1 Slimతో గరిష్టంగా 16జి‌బి ర్యామ్, 512జి‌బి వరకు SSD స్టోరేజ్ ఉంటుంది.

Infinix InBook X1 స్లిమ్ ధర
ఇన్ఫినిక్స్ ఇన్ బుక్ ఎక్స్1 స్లిమ్ 10the Gen Intel Core i7 ప్రాసెసర్ ధర రూ.49,990, Intel Core i5 16జి‌బి ర్యామ్, 512జి‌బి  స్టోరేజ్ ధర రూ.44,990, Intel Core i3 8జి‌బి ర్యామ్ 256జి‌బి  స్టోరేజ్ ధర రూ. రూ. 29,990. ల్యాప్‌టాప్‌ను అరోరా గ్రీన్, కాస్మిక్ బ్లూ, నోబుల్ రెడ్ అండ్ స్టార్‌ఫాల్ గ్రే రంగులలో కొనుగోలు చేయవచ్చు.

23

Infinix InBook X1 స్లిమ్ ఫీచర్లు 
Infinix InBook X1 Slim 300 నిట్స్  బ్రైట్ నెస్ తో 14-అంగుళాల పూర్తి HD+ IPS డిస్‌ప్లే ఉంది. ల్యాప్‌టాప్ 512జి‌బి వరకు M.2 NVMe PCIe 3.0 SSD స్టోరేజ్ తో 16జి‌బి వరకు LPDDR4 ర్యామ్ తో ప్యాక్ చేయబడింది. 50Wh బ్యాటరీని 9 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. దీనితో 65W టైప్-సి ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంది, ఇంకా 90 నిమిషాల్లో బ్యాటరీ నిండిపోతుందని పేర్కొంది.

33

InBook X1 స్లిమ్ అల్యూమినియం అల్లాయ్ మెటల్ బాడీని పొందుతుంది. ల్యాప్‌టాప్‌తో పాటు HD వెబ్‌క్యామ్ ఉంటుంది. దీనితో, స్టీరియో స్పీకర్లు కూడా ఉంటాయి, దీనితో DTSకి సపోర్ట్ కూడా ఉంది. గేమింగ్ కోసం 1.0 కూలింగ్ సిస్టమ్‌ను ఉంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో రెండు USB 3.0 పోర్ట్‌లు, రెండు USB టైప్-C పోర్ట్‌లు, ఒక HDMI 1.4 పోర్ట్, ఒక ఎస్‌డి కార్డ్ రీడర్, 3.5mm హెడ్‌ఫోన్ కాంబో జాక్ ఉన్నాయి.

click me!

Recommended Stories