మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే ఫోటోలు, smsలతో సహా..!

First Published | Dec 8, 2023, 7:03 PM IST

స్మార్ట్‌ఫోన్‌లో అవసరాలు, వినియోగానికి అనుగుణంగా చాలా యాప్‌లు ఉన్నాయి. అయితే కొన్ని యాప్‌లు నిబంధనలను ఉల్లంఘించి వినియోగదారులకు నష్టం కలిగించడం కొత్తేమీ కాదు. అదేవిధంగా, భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న 17 యాప్‌లను గూగుల్ నిషేధించింది.
 

వినియోగదారులకు సేవలందించే నెపంతో చాలా యాప్‌లు హద్దులు దాటి పనిచేస్తున్నాయి. అలాంటి యాప్‌లను గుర్తించి నిషేధించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 

ఇప్పుడు గూగుల్ భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సమాచారాన్ని దొంగిలించే, వినియోగదారులను మానసికంగా హింసించే,  హెచ్చరించే ఇంకా బెదిరించే 17 యాప్‌లను నిషేధించింది. 
 

Apps

లోన్ యాప్ భారతదేశంలో అతిపెద్ద నెట్‌వర్క్. ఈ నెట్‌వర్క్‌లోను అవే మోసాలు జరుగుతున్నాయి. కస్టమర్‌లు, యూజర్‌లను మోసం చేసి చివరకు బెదిరించి ప్రాణాలకు ముప్పు తెచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి 17 యాప్‌లు నిషేధించబడ్డాయి.

AA క్రెడిట్, అమోర్ క్యాష్, గోయిబా క్యాష్, ఈజీ క్రెడిట్, క్యాష్ వావ్, క్రెడిట్ బస్, క్యాష్ లోన్ సహా 17 యాప్‌లను గూగుల్ నిషేధించింది.
 


ఈ యాప్‌లు వినియోగదారుల వ్యక్తిగత డేటాను ఇంకా వినియోగదారులను మోసం చేస్తున్నాయి. ఇంకా  యూజర్ SMSలు, ఫోటోలు, వ్యక్తిగత సమాచారం, బ్రౌజింగ్ హిస్టరీని కూడా దొంగిలిస్తున్నాయి. 

ఈ డేటాను ఉపయోగించి వినియోగదారులని  బ్లాక్ మెయిల్, విపరీతమైన వడ్డీలు, అప్పులు తిరిగి చెల్లించాలని వేధింపులు, ప్రాణహాని కలిగిస్తున్నారు. 

దాదాపు 12 మిలియన్ల మంది ఈ యాప్‌లను ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ భారతదేశం, థాయిలాండ్, మెక్సికో, ఇండోనేషియా, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్‌తో సహా 12 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉంది.

ఫిర్యాదు అందిన వెంటనే గూగుల్ దీనిపై విచారణ జరిపి 12 యాప్‌లను బ్యాన్ చేసింది. ఇప్పటికే గూగుల్  ప్లేస్టోర్ నుండి 200కి పైగా లోన్ యాప్‌లను బ్యాన్ చేసింది.

Latest Videos

click me!