పాస్‌పోర్టు కావాలా.. చాలా ఈజీ.. ఇప్పుడు ఇంట్లో కూర్చొనే అప్లయ్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..

First Published | Dec 6, 2023, 3:49 PM IST

విదేశాలకు వెళ్లాలంటే ముందుగా కావాల్సింది పాస్‌పోర్ట్. దీన్ని అందించే  ప్రక్రియ ఇప్పుడు చాలా సులభం అయింది. ఇంట్లో కూర్చొని కూడా ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని పాస్‌పోర్ట్ పొందాలనుకుంటే, మీరు ఎం-పాస్‌పోర్ట్ సర్వీస్ యాప్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
 

ఈ యాప్‌తో, మీరు మీ ఆధార్ కార్డ్ సహాయంతో మాత్రమే పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్ పోర్టు పొందాలంటే రూ.1500 ఫీజు చెల్లించాలి. ఇక్కడ నుండి దరఖాస్తు చేసుకున్న తర్వాత, మీరు వన్ టైమ్ పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత, మీ పాస్‌పోర్ట్ ఆటోమేటిక్ గా రూపొందించబడుతుంది ఇంకా  మీ అడ్రసుకు పోస్టులో చేరుకుంటుంది.
 

ముందుగా మీ మొబైల్‌లో mPassport సేవా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు ఈ యాప్‌లో రిజిస్టర్ కావాలి. ఇందుకు  మీరు న్యూ యూజర్ రిజిస్టర్  లింక్‌పై క్లిక్ చేయాలి. దీని తర్వాత మీరు మీ అడ్రస్ ఆధారంగా మీ సమీపంలోని పాస్‌పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి.

మీ అడ్రస్ ఉన్న రాష్ట్ర పాస్‌పోర్ట్ ఆఫీస్  సెలెక్ట్ చేసుకున్నాక పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడి అండ్ ఇతర సంబంధిత వివరాలు  ఎంటర్  చేయండి. తర్వాత పర్సనల్ లాగిన్ ఐడీ-పాస్‌వర్డ్, ఇతర వివరాలు ఇంకా  క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. మీరు ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత. పాస్‌పోర్ట్ ఆఫీస్  ద్వారా మీ ఇమెయిల్ అడ్రస్ కి  వెరిఫికేషన్ లింక్ పంపబడుతుంది.
 


ఈ వెరిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, మీరు కొత్త వెబ్ పేజీకి మళ్లించబడతారు. వెరిఫికేషన్  కోసం లాగిన్ IDని ఎంటర్ చేయమని అదిగుతుంది. అకౌంట్ వెరిఫికేషన్ తర్వాత, మీరు యాప్‌ను మూసివేసి మళ్లీ లాగిన్ చేయాలి. దీని తర్వాత, మీరు ఇప్పటికే ఉన్న యూజర్ ట్యాబ్ లింక్‌పై క్లిక్ చేయాలి.

అప్పుడు మీరు లాగిన్ ఐడి, పాస్‌వర్డ్ ఇంకా  క్యాప్చా కోడ్‌ను ఎంటర్  చేయాలి. ఇప్పుడు మీరు అప్లయ్ న్యూ  పాస్‌పోర్ట్   పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు పాస్‌పోర్ట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి.
 

దీని తర్వాత, మీ గురించి అడిగిన సమాచారాన్ని నింపాలి తరువాత అప్లికేషన్‌లో పేర్కొన్న విధానాన్ని అనుసరించండి. ఇప్పుడు మీ అడ్రస్ ఇంకా  సంబంధిత సమాచారాన్ని ఎంటర్ చేయాలి. ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మీకు సహాయం చేయగల వ్యక్తి వివరాలను ఇవ్వండి. అవసరమైన సమాచారాన్ని అందించండి. చివరకు ఫీజు చెల్లించి అపాయింట్‌మెంట్‌ను ఫిక్స్ చేసుకోండి. ఆ తర్వాత పాస్‌పోర్ట్ కేంద్రాన్ని సందర్శించి డాకుమెంట్స్ సరిచూసుకోవాలి.

Latest Videos

click me!