మీ ఫోన్‌లో స్టోరేజ్ నిండిపోయిందా? అయితే ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయకుండానే మెమోరీ ఖాళీ చేయొచ్చు. ఎలాగో తెలుసుకొండి… మీ ఫోన్ మెమోరీని పెంచుకుని నిశ్చింతగా వాడుకొండి.
ఇప్పటి స్మార్ట్‌ఫోన్లలో కెమెరా క్వాలిటీ చాలా ఎక్కువ. అందుకే ఫొటోలు, వీడియోలు ఎక్కువ మెమరీని తీసుకుంటాయి. దీంతో వందల జిబి ఇంటర్నల్ స్టోరేజ్ (Storage Full) కలిగిన ఫోన్లు సైతం త్వరగా నిండిపోయి హ్యాంగ్ అవుతుంది. దీంతో ఎంతో ఇష్టంగా, జీవితాంతం జ్ఞాపకంగా ఉంచుకోవాలని అనుకున్న వీడియోలు, ఫొటోలను డిలీట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ భయం వద్దు… ఫోన్ లోని డాటా డిలీట్ చేయకుండానే మీ స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ పెంచుకోవచ్చు. దీనికి కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి.
25
క్లౌడ్ స్టోరేజ్‌తో ఫొటోలు సేఫ్
మీ ఫొటోలను భద్రంగా ఉంచడానికి క్లౌడ్ స్టోరేజ్ బెస్ట్ ఆప్షన్. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ఫొటోస్ (Google Photos) లేదా గూగుల్ డ్రైవ్ (Google Drive) వాడొచ్చు. ఇందులో 'బ్యాకప్' ఆన్ చేస్తే ఫొటోలు ఆన్‌లైన్‌లో సేవ్ అవుతాయి. ఆ తర్వాత ఫోన్ గ్యాలరీ నుంచి వాటిని డిలీట్ చేసినా పర్లేదు. యాపిల్ యూజర్లు ఐక్లౌడ్ (iCloud) వాడొచ్చు.
35
కాష్ డేటా క్లియర్ చేయండి
మనం రోజూ వాడే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్స్ చాలా 'కాష్ డేటా'ను ఫోన్‌లో స్టోర్ చేస్తాయి. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, యాప్ మేనేజర్ ద్వారా ఈ జంక్ ఫైల్స్‌ను క్లియర్ చేస్తే, ముఖ్యమైన ఫైల్స్ ఏవీ డిలీట్ అవ్వకుండానే కొన్ని జీబీల స్టోరేజ్ ఖాళీ అవుతుంది.
మన ఫోన్ మెమరీ నిండటానికి ప్రధాన కారణం వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే గుడ్ మార్నింగ్ ఇమేజ్‌లు, అనవసర వీడియోలే. వాట్సాప్ సెట్టింగ్స్‌లోని 'డేటా అండ్ స్టోరేజ్' ఆప్షన్‌లోకి వెళ్తే, ఎక్కువ స్పేస్ తీసుకుంటున్న పెద్ద ఫైల్స్‌ను సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు.
55
'లైట్' యాప్స్ వాడండి
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి పెద్ద సైజు యాప్స్‌కు బదులుగా వాటి 'లైట్' (Lite) వెర్షన్లను వాడండి. ఇవి ఫోన్ ఇంటర్నల్ మెమరీని చాలా తక్కువగా ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఫోన్ మెమరీ తొందరగా ఫుల్ అవదు.