పాత రోజులను గుర్తు చేస్తున్న కొత్త ఫోన్‌.. రూ. 899కే వైర్‌లెస్ FM రేడియో, స్నేక్ గేమ్‌, లాంగ్ బ్యాట‌రీ

Published : Jul 15, 2026, 08:19 PM IST

HMD 100: స్మార్ట్‌ఫోన్‌ల హడావుడి మధ్య ఇప్పటికీ చాలా మంది కాల్స్, మెసేజ్‌ల కోసం ఫీచర్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. అలాంటి వారి కోసం HMD సంస్థ HMD 100 పేరుతో కొత్త ఫీచర్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
రూ.899కే అందుబాటులో..

HMD 100 ఫీచర్ ఫోన్ ధర రూ.899. గ్రే రంగులో అందుబాటులో ఉంది. బలమైన బాడీ, చేతిలో సౌకర్యంగా పట్టుకునే డిజైన్‌తో రూపొందించారు. రోజువారీ వినియోగంలో చిన్నపాటి దెబ్బలు తట్టుకునేలా దీనిని తయారు చేశారు. ఎక్కువ ఆర్భాటం లేకుండా సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపించేలా డిజైన్ చేశారు.

25
వారం రోజుల వరకు స్టాండ్‌బై బ్యాటరీ

ఈ ఫోన్‌లో 800mAh రిమూవబుల్ బ్యాటరీ ఇచ్చారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 168 గంటల (దాదాపు 7 రోజులు) స్టాండ్‌బై టైమ్ అందుతుంది. అలాగే సుమారు 6 గంటల టాక్‌టైమ్ లభిస్తుంది. బ్యాటరీ అయిపోయినప్పుడు సులభంగా తీసి కొత్త బ్యాటరీ కూడా పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ కోసం మైక్రో USB పోర్ట్ ఇచ్చారు.

35
FM రేడియో, టార్చ్‌తో పాటు..

HMD 100లో కాల్స్, మెసేజ్‌లతో పాటు రోజువారీ అవసరాలకు ఉపయోగపడే అనేక ఫీచర్లు ఉన్నాయి. 1.77 అంగుళాల డిస్‌ప్లే, వైర్డ్, వైర్‌లెస్ FM రేడియో, ప‌వ‌ర్‌ఫుల్ టార్చ్ లైట్, టెక్స్ట్-టు-స్పీచ్ (Text-to-Speech) ఫీచర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్, విద్యుత్ లేని సమయంలో టార్చ్, ప్రయాణాల్లో FM రేడియో వంటి ఫీచర్లు బాగా ఉపయోగపడతాయి.

45
పనితీరు ఎలా ఉంది..?

ఈ ఫోన్‌లో Unisoc 6533G ప్రాసెసర్ ఇచ్చారు. S30+ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేస్తుంది. ఇందులో 8MB RAM, 4MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఇది సింగిల్ సిమ్ (2G GSM 900/1800) సపోర్ట్ చేస్తుంది. కాల్స్ చేయడం, మెసేజ్‌లు పంపడం వంటి సాధారణ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. ఇక ఇందులో ఎవ‌ర్ గ్రీన్ స్నేక్ గేమ్‌ను కూడా అందించారు.

55
Vi ఆఫర్ కూడా ఉంది

HMD లేదా Nokia ఫీచర్ ఫోన్ కొనుగోలు చేసిన వారికి Vi ప్రత్యేక ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. సమీపంలోని Vi రిటైలర్ వద్ద కొత్త HMD 100తో వెళ్లి నెలకు రూ.140కే 12 నెలల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్ కింద మొత్తం రూ.826 వరకు ఆదా చేసే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories