15000 లోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు
మీరు ఉద్యోగి అయినా, స్టూడెంట్ అయినా లేదా బిజినెస్ చేసే వారైనా, ప్రతి ఒక్కరికీ ల్యాప్‌టాప్ అవసరం. మనం కొన్ని పనులు చేయడానికి ల్యాప్‌టాప్‌పై ఎక్కువగా ఆధారపడతాము. కానీ కొందరు ల్యాప్‌టాప్ కొనేందుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటుంటారు. 15000 లోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లను అందించే HP, AXL ఇంకా అనేక ఇతర బ్రాండ్‌ల నుండి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి చూద్దాం...
జియోబుక్ ల్యాప్‌టాప్
జియోబుక్ 11 (JioBook) ల్యాప్‌టాప్ కాలేజ్ విద్యార్థులకు బెస్ట్ పోర్టబుల్ ల్యాప్‌టాప్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ల్యాప్‌టాప్‌తో సులభంగా Wi-Fiకి కనెక్ట్ చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ 8 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. జియోబుక్ ల్యాప్‌టాప్ ధర: రూ. 14,499.
AXL ల్యాప్‌టాప్
AXL Vayubook ల్యాప్‌టాప్ చిన్నగా ఇంకా కాంపాక్ట్ గా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా మీ బ్యాగ్‌లో సులభంగా తీసుకెళ్లవచ్చు. 14-అంగుళాల FHD IPS డిస్ ప్లే మీరు పని చేస్తున్నప్పుడు స్పష్టమైన వ్యూ అందిస్తుంది. ఇంకా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ ల్యాప్‌టాప్ 4 GB RAM ఉంది. AXL ల్యాప్‌టాప్ ధర: రూ. 12,990.
వాకర్ ల్యాప్‌టాప్
walker నోట్‌బుక్/ల్యాప్‌టాప్ ఫుల్ HD IPS ప్యానెల్‌తో రూపొందించబడింది. అత్యాధునిక 128 GB SSDతో వస్తుంది. మొబైల్ ఇంకా ఆన్‌లైన్ ఉపయోగం కోసం ఆప్టిమైజ్ చేయబడింది. వాకర్‌లో ఇంటర్నల్ 2.0 మెగాపిక్సెల్ HD కెమెరా ఉంది, ఇంకా మంచి నాణ్యతతో ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. వాకర్ ల్యాప్‌టాప్ ధర: రూ.14,690.
HP ల్యాప్‌టాప్
అప్ డేటెడ్ HP Chromebook 13 ల్యాప్‌టాప్ మీకు ఫాస్ట్ పర్ఫార్మెన్స్ తో పాటు అద్భుతమైన మన్నికను అందిస్తుంది. ఇంటెల్ HD గ్రాఫిక్స్ 515 వంటి ఫీచర్లతో వస్తుంది. ఇందులో Chrome OS ఇన్‌స్టాల్ చేయబడింది. స్పష్టమైన వెబ్‌క్యామ్ ఇంకా మైక్రోఫోన్‌తో వస్తుంది. అదనంగా, బ్లూటూత్ 4.0 చేర్చబడింది. అప్ డేటెడ్ HP ల్యాప్‌టాప్ ధర: రూ.14,999.