గూగుల్ పేలో కొత్త ఫీచర్‌లు: ఇప్పుడు వాయిస్ ద్వారా కూడా డబ్బు పంపోచ్చు..

First Published | Nov 23, 2021, 12:24 PM IST

డిజిటల్ వాలేట్ ఫ్లాట్ ఫార్మ్ అండ్ ఆన్ లైన్ పేమెంట్ సిస్టమ్ గూగుల్ పే(google pay)కి భారతదేశంలో భారీ యూజర్ లిమిట్ కలిగి ఉంది. డిజిటల్ లావాదేవీల కోసం కోట్లాది మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్ ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు ఎన్నో స్పెషల్ అండ్ సెక్యూరిటి ఫీచర్‌లను తీసుకువస్తూనే ఉంది. 

ఈ ఫీచర్ల ముఖ్య ఉద్దేశ్యం వినియోగదారుల లావాదేవీలను సురక్షితంగా ఉంచడం ఇంకా వినియోగదారుడి అనుభవాన్ని మెరుగుపరచడం. దీనికి సంబంధించి  గూగుల్ పే ఈ యాప్‌కి 4 కొత్త ఫీచర్‌లను జోడించబోతోంది. ఈ 4 కొత్త ఫీచర్లు వినియోగదారుల అనుభవాన్ని మార్చేందుకు పని చేస్తాయి.  గూగుల్ పేని ఉపయోగించడం ఇంతకుముందుకంటే ఇప్పుడు మరింత సులభం అవుతుంది. అయితే, ఈ యాప్‌ను మరింత మెరుగ్గా, మరింత సురక్షితమైనదిగా చేయడానికి గూగుల్ చాలా కాలంగా కృషి చేస్తోంది. దీనికి సంబంధించి కంపెనీ తీసుకురాబోతున్న  గూగుల్ పే 4 గొప్ప ఫీచర్ల గురించి  తెలుసుకోండి..

హింగ్లీష్  భాష(Hinglish language)
గూగుల్ పే ఇప్పుడు  యాప్‌లో హింగ్లీష్  లాంగ్వేజ్ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఎక్కువగా హింగ్లీష్  భాషను ఉపయోగించే వారికి ఈ ఫీచర్ సహాయం చేస్తుంది.  డబ్బు పంపేటప్పుడు మీరు హింగ్లీష్  భాషలో గూగుల్ పేని ఉపయోగించవచ్చు.  

Latest Videos


స్పీచ్ టు టెక్స్ట్ 
స్పీచ్ టు టెక్స్ట్ ఫీచర్ మీ డిజిటల్ లావాదేవీల ప్రక్రియను చాలా సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్ సహాయంతో మీరు డబ్బు పంపేటప్పుడు మాట్లాడటం ద్వారా ఎవరి ఖాతా నంబర్‌ను అయినా ఫీడ్ చేయవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో మీరు మీ వాయిస్‌తో డబ్బును బదిలీ చేయగలుగుతారు. 

మై షాప్
మై షాప్ ఫీచర్ ఉద్దేశ్యం గూగుల్ పేతో ఎక్కువ మంది షాపర్‌లను కనెక్ట్ చేయడం. ఈ ఫీచర్ రాకతో చాలా మంది దుకాణదారులు వారి దుకాణాన్ని గూగుల్ పే యాప్‌లో ప్రదర్శించగలుగుతారు. మై షాప్ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఏదైనా వస్తువు ఆర్డర్‌ను కూడా బుక్ చేసుకోగలరు. 

బిల్లు విభజన (bill split)
గూగుల్ పే ఈ ఫీచర్‌తో మీరు ఒకేసారి ఎక్కువ మందికి డబ్బు పంపవచ్చు. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం మీరు  5 స్నేహితులకు ఒకొక్కరికి 200 రూపాయలు పంపల్సి ఉంది. ఇలాంటి పరిస్థితిలో మీరు 1000 రూపాయలు టైప్ చేయాలి, ఆ తర్వాత తదుపరి దశలో మీరు డబ్బు పంపాల్సిన 5 మంది పేర్లను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు పిన్‌ను ఎంటర్ చేసిన వెంటనే మొత్తం 5 మంది వ్యక్తుల ఖాతాలకు వెంటనే డబ్బు బదిలీ చేయబడుతుంది. వారికి విడిగా లేదా ప్రత్యేకంగా డబ్బును బదిలీ చేయవలసిన అవసరం లేదు. ఈ ఫీచర్ సహాయంతో మీరు బిల్లును ఏకకాలంలో విభజించవచ్చు.

click me!