దాని ఫీచర్స్ గురించి మాత్రమే కాకుండా మోడల్ పేర్ల గురించి కూడా ఒక ఆలోచనను ఇస్తుంది.
కొనసాగుతున్న ఆపిల్ ట్రెడిషన్
ఆపిల్ సాధారణంగా కొత్త ఐఫోన్‌లను సెప్టెంబర్ మొదటి వారాల్లో విడుదల చేస్తుంది. నెలలో చివరి వారాల్లో విక్రయిస్తుంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆపిల్ సెప్టెంబర్ 14న ఐఫోన్ 13 సిరీస్‌ను పరిచయం చేసింది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లలో విక్రయానికి వచ్చింది. సెప్టెంబర్ 2022లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఇఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేయడం ద్వారా సంస్థ ఈ సంప్రదాయాన్ని వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తారని భావిస్తున్నారు.
ఐఫోన్ మోడల్‌లు
వచ్చే ఏడాది యాపిల్ ఐఫోన్ 14ని ఎంట్రీ లెవల్ ఐఫోన్‌గా మారుస్తుందని ఊహాగానాలు చేస్తున్నారు. ఐఫోన్ 14 సిరీస్ కొద్దిగా భిన్నమైన పేర్లతో నాలుగు ఐఫోన్ మోడల్‌లను ఉండొచ్చని ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యాక్స్ మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయని భావిస్తున్నారు.
ఫీచర్ల
ఫీచర్ల గురించి మాట్లాడితే ఎంట్రీ లెవల్ ఐఫోన్ 14 నాచ్‌ని నిలుపుకోవాలని భావిస్తున్నారు. ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడితే ఆపిల్ డిస్ ప్లే కింద ఫేస్ ఐడి భాగాన్ని దాచి ఉండవచ్చు. అదనంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో గ్లాస్ బ్యాక్‌తో కూడిన స్టెయిన్‌లెస్ స్టీల్ ఛాసిస్‌తో వస్తాయని భావిస్తున్నారు.