ఇన్‌స్టాగ్రామ్ మరో అద్భుతమైన ఫీచర్.. యూజర్ల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని అందుబాటులోకి..

First Published | Nov 13, 2021, 6:49 PM IST

ఫేస్ బుక్ యజమాన్యంలోని ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (instagram)యూజర్ల సౌలభ్యం కోసం ఒక కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్  ఈ  కొత్త ఫీచర్‌కు "టేక్ ఎ బ్రేక్" అని పేరు పెట్టింది.కొంత కాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా యూజర్ల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

కంపెనీ హెడ్ ఆడమ్ మోస్సేరి ఈ ఫీచర్ గురించి స్వయంగా  సమాచారం ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ వ్యసనాన్ని వదిలించుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని ఆడమ్ మోస్సేరి చెప్పారు.

అన్ని యాప్‌ల యూజర్లు సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారని కంపెనీకి పూర్తిగా తెలుసునని ఫేస్‌బుక్ పరిశోధన నివేదికను ఉటంకిస్తూ ఎన్నో నివేదికలు క్లెయిమ్ చేయడంతో ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్, రీల్స్ పేరు ఎప్పటికీ ముగియని వ్యసనంలో మొదటి స్థానంలో ఉంది.
 

ఇన్‌స్టాగ్రామ్ టేక్ ఎ బ్రేక్ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆన్ చేసి ఉండదు. వినియోగదారులు వారి సౌలభ్యం ప్రకారం దీన్ని ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. బ్రేక్ కోసం 10, 20 లేదా 30 నిమిషాల ఆప్షన్ ఉంటుంది. ఆడమ్ మోస్సేరి కూడా ఈ ఫీచర్ గురించి ఒక వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. రాబోయే కాలంలో ఇలాంటి మరిన్ని ఫీచర్లను వినియోగదారుల కోసం విడుదల చేయనున్నట్లు ఆడమ్ మోస్సేరి తెలిపారు.  

Latest Videos


ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్స్ అనే మరో ఫీచర్‌ని కూడా పరీక్షిస్తోంది. దీని సహాయంతో వినియోగదారులు ప్రత్యేకమైన కంటెంట్ కోసం వారి ఫాలోవర్స్ నుండి ఛార్జీ విధించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్  ఈ సబ్‌స్క్రిప్షన్ మోడల్ ట్విట్టర్  బ్లూ ఆధారంగా రూపొందించారు.

యూ‌ఎస్ లో ఒక్కో ఫాలోవర్ కి ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు 0.99 డాలర్లు నుండి 4.99 డాలర్ల మధ్య ఉంటుంది, అయితే భారతదేశంలో ప్రతి వినియోగదారుడికి  నెలకు రూ. 89 ఛార్జ్ చేయబడుతుంది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో పాటు సబ్‌స్క్రిప్షన్ బ్యాగేజీ అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది మేలో ట్విట్టర్  పేమెంట్ సర్వీస్ అయిన ట్విట్టర్ బ్లూను ప్రారంభించింది.

click me!