అలాగే ప్రజలు ఇంటి నుండి బయటికి వెళ్తే మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం, శానిటైజర్లు వంటి వాటిపై అవగాహన కల్పించాలని కోరారు. మరోవైపు అన్ని ప్రధాన టెలికాం కంపెనీలు వాటి నెట్‌వర్క్‌లో 30 సెకన్ల కరోనా కాలర్ ట్యూన్‌ను అమలు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ టెలికమ్యూనికేషన్స్ విభాగానికి సూచనలు ఇచ్చింది. దీంతో మీరు మీ మొబైల్ నుండి ఎవరికైనా కాల్ చేస్తే మొదట కరోనా కాలర్ ట్యూన్‌ని వినిపిస్తుంది.
అయితే ఈ ట్యూన్ విని జనాలు ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నారు. ఒకానొక సందర్భాల్లో మీరు కూడా ఈ కాలర్ ట్యూన్‌ను తీసివేయడానికి ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలని కోరుకునే ఉంటారు. అయితే కరోనా కాలర్ ట్యూన్ తీసివేయడానికి సులభమైన మార్గం గురించి తెలుసుకోండి..
మీరు చేయాల్సిందల్ల మొదట మీరు ఎవరికైనా కాల్ చేసినపుడు మీరు కరోనా కాలర్ ట్యూన్ విన్న వెంటనే 1 నంబర్‌ను నొక్కాలి. మీరు దాన్ని నొక్కిన వెంటనే మీకు సాధారణ కాలర్ ట్యూన్ వినబడుతుంది.
కొన్ని ఇతర మార్గాలు: -
బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు
బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు ఇందుకు ఒక మెసేజ్ పంపవలసి ఉంటుంది, మీరు UNSUB అని టైప్ చేసి 56700 లేదా 56799కి పంపించాలి. అప్పుడు మీ కరోనా కాలర్ ట్యూన్ డిఆక్టివేట్ అయినట్లు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
ఎయిర్‌టెల్ వినియోగదారులు
మీరు ఎయిర్‌టెల్ వినియోగదారులైతే మెసేజ్ లో 144కి CANCTని టైప్ చేసి పంపాలి, దీంతో కరోనా కాలర్ ట్యూన్ ఆగిపోతుంది.
జియో వినియోగదారులు
రిలయన్స్ జియో వినియోగదారులు ఇప్పుడు మెసేజ్‌లో STOP అని టైప్ చేసి 155223కి ఎస్‌ఎంఎస్ పంపాలి, దీంతో కరోనా కాలర్ ట్యూన్ డిఆక్టివేట్ అవుతుంది.