Good news:వాట్సాప్‌ డిజిలాకర్‌.. ఒక్క మెసేజ్ తో ఆధార్, పాన్ కార్డ్ ఏదైనా క్షణాల్లో మీ ఫోన్‌లోకీ

First Published | May 24, 2022, 12:33 PM IST

మీకు  స్మార్ట్ ఫోన్ ఉండి అందులో  చాలా యాప్స్ తో ఇబ్బంది ఉంటే మీకు గుడ్ న్యూస్. ఏంటంటే ఇప్పుడు మీరు డిజిలాకర్‌ని వాట్సాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు ఇంకా  మీ డాక్యుమెంట్స్  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్‌తో ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందించింది. 

దీని అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీ ఫోన్‌లో వాట్సాప్ ఉంటే మీరు డిజిలాకర్ యాప్‌ను విడిగా డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డిజిలాకర్‌లో ఇప్పటివరకు 10 కోట్ల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారని, 500 కోట్ల డాక్యుమెంట్లు అప్‌లోడ్ అయ్యాయని పేర్కొంది. డిజిలాకర్‌ను వెబ్ అండ్ మొబైల్ యాప్ రెండింటి ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

వాట్సాప్‌లో డిజిలాకర్ డాక్యుమెంట్స్ డౌన్‌లోడ్ చేయడం ఎలా
ముందుగా చేయాల్సింది +91-9013151515 నంబర్‌ను మీ ఫోన్ లో సేవ్ చేయడం. ఇప్పుడు WhatsApp మెసేజింగ్ యాప్‌ని ఓపెన్ చేసి DigiLocker అని టైప్ చేసి  +91-9013151515 నంబరుకు ఎస్‌ఎం‌ఎస్  పంపండి. ఇప్పుడు మీరు పాన్ కార్డ్ నుండి సర్టిఫికేట్ వరకు ఆప్షన్స్ పొందుతారు. డిజిలాకర్ యాప్ లాగానే వాట్సాప్‌లోని ఆధార్ నంబర్ ద్వారా వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, మీరు మీ డాక్యుమెంట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే వాట్సాప్ ద్వారా   మీరు కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్ చేసుకున్నట్లుగానే ఉంటుంది.
 

MyGov సి‌ఈ‌ఓ, ఎం‌డి అండ్ సి‌ఈ‌ఓ ఆఫ్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, “MyGov హెల్ప్‌డెస్క్‌తో DigiLocker సేవలను అందించడం సహజమైన పురోగతి అలాగే ప్రజలకు సులభమైన అక్సెస్ ద్వారా అవసరమైన సేవలకు సింపుల్ అక్సెస్ అందిస్తుంది" అని అన్నారు.

 2020లో హెల్ప్‌డెస్క్ ప్రారంభం
మార్చి 2020లో కరోనా మహమ్మారి గురించి సమాచారాన్ని అందించడానికి వాట్సాప్‌లో MyGov హెల్ప్‌డెస్క్ ప్రారంభించారు. కానీ ఇప్పుడు  ఇ-కామర్స్ సేవలకు ఉపయోగించబడుతోంది. MyGov హెల్ప్‌డెస్క్ వినియోగదారుల సంఖ్య ఇప్పుడు 80 మిలియన్లు. దీని ద్వారా ఇప్పటివరకు 3.3 కోట్ల మంది వ్యాక్సిన్ సర్టిఫికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంతకుముందు ముఖ్యమైన డాక్యుమెంట్లను  ఇంట్లో దాచుకునే వారు. కానీ ఈ డిజిటల్ యుగంలో మొత్తం ఆన్‌లైన్ అయిపోయింది. డిజిలాకర్‌ వంటి డిజిటల్ డాక్యుమెంట్ వాలెట్లు వచ్చేశాయి. దీంతో ఫిజికల్ డాక్యుమెంట్లను మోసుకెళ్లాల్సిన పనిలేదు. 
 

Latest Videos


డిజిలాకర్ సేవలను మరింత విస్తరిస్తూ ప్రజలకు అవసరమైన డాక్యుమెంట్స్ సులభంగా అందించడానికే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. డిజిలాకర్ డిజిటల్ ఇండియా ప్రొగ్రామ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ వాలెట్ డాక్యుమెంట్ వాలెట్ ప్లాట్‌ఫామ్. దేశ ప్రజలు  ముఖ్య‌మైన డాక్యుమెంట్స్  ఆన్‌లైన్‌లో స్టోర్ చేసుకునేందుకు దీనిని తీసుకొచ్చారు. ఇంకా ఉచితంగా లభిస్తుంది. 
 

ఈ డిజిటల్ డాక్యుమెంట్ వాలెట్ ప్రజలకు అథెంటికేట్ డాక్యుమెంట్ల యాక్సస్‌ను కల్పిస్తుంది. మనకు కావాల్సిన డాక్యుమెంట్ల వివరాలను ఎంటర్ చేస్తే ఆ సర్టిఫికెట్స్ డిజిలాకర్‌లోకి వచ్చేస్తాయి. మీరు ఏవైనా డాక్యుమెంట్స్ దాచుకోవాలంటే కూడా అందులోకి అప్‌లోడ్ చేయవచ్చు.  ఆ తర్వాత మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు డిజిలాకర్ నుంచి ఈ డాక్యుమెంట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ ఫిజికల్ డాక్యుమెంట్ల లాగానే డిజిలాకర్‌లోని డాక్యుమెంట్లు చెల్లుతాయి. అవసరమైన చోట.. వాటిని చూపిస్తే సరిపోతుంది. 

click me!