రూ.10వేలకే ఇలాంటి స్మార్ట్ ఫోన్ ఉందా.. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లిస్ట్ ఇది!

First Published | Aug 9, 2024, 3:47 PM IST

శాంసంగ్ స్మార్ట్ ఫోన్ అంటే అందరికీ ఇష్టమే. తక్కువ ధర నుండి ప్రీమియం ఫోన్ల వరకు Samsungలో అందుబాటులో ఉన్నాయి. మీరు మీ బడ్జెట్‌ని బట్టి స్మార్ట్‌ఫోన్‌ను కొనవచ్చు. అయితే రూ.10,000లోపు బడ్జెట్‌కు ఫ్రెండ్లీ Samsung ఫోన్‌లను చూద్దాం...

Samsung Galaxy M14 స్మార్ట్‌ఫోన్‌లో 6.6-అంగుళాల PLS LCD డిస్‌ప్లే ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో మంచి వ్యూ  అనుభవాన్ని అందిస్తుంది. ఇంకా పవర్ ఫుల్ 6000mAh బ్యాటరీతో వస్తుంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్.. అందులో 50MP ప్రైమరీ  కెమెరా ఉంది. దీని ధర రూ.8,442.
 

Samsung Galaxy A04E స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల PLS LCD డిస్‌ప్లే, డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 13MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఇచ్చారు. 5000mAh బ్యాటరీగల దీని ధర రూ.9,390.
 


Samsung Galaxy M04 ఫోన్ 6.5-అంగుళాల PLS LCD డిస్‌ప్లే, వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్, 13MP ప్రైమరీ  సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. ముందు భాగంలో 5MP కెమెరా ఇచ్చారు. ఇంకా 5000 mAh బ్యాటరీ ఉంది. దీని ధర రూ.8,999.

Samsung Galaxy F04 స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల PLS LCD డిస్‌ప్లే, డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 13MP మెయిన్ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందువైపు 5MP కెమెరా, 5000 mAh కెపాసిటీ బ్యాటరీ దీనిలో ఉంది. దీని ధర రూ.7,999.
 

Latest Videos

click me!