Social Media: అంద‌రూ ఎంజాయ్ చేస్తున్నారు నేను త‌ప్ప‌.. సోష‌ల్ మీడియాతో పెరుగుతోన్న ఫోమో

Published : Jun 22, 2025, 10:55 AM IST

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా విస్తృతి బాగా పెరిగిపోయింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి యాప్స్‌ను తెగ ఉప‌యోగిస్తున్నారు. అయితే వీటితో ఎంత మంచి జ‌రుగుతుందో అదే స్థాయిలో చెడు కూడా జ‌రుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. 

PREV
17
డిజిటల్ టెక్నాలజీ విప్లవం

అత్యంత త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది ఏదైనా ఉందంటే అది సోష‌ల్ మీడియా అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా 2023 నాటికి సుమారు 4.9 బిలియన్ల మంది సోషల్ మీడియా యూజర్లు ఉన్నారు. 

ఒక వ్యక్తి రోజుకు సగటున 145 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ప్ర‌పంచంలో ఏ మూల‌న ఏం జ‌రిగినా క్ష‌ణాల్లో అర చేతిలో వాలిపోతోంది. యూజ‌ర్ల‌కు విప‌రీత‌మైన కంటెంట్ ల‌భిస్తోంది.

27
మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం

అయితే ప్ర‌పంచంతో నిత్యం ట‌చ్‌లో ఉండేందుకు ఉప‌యోగ‌ప‌డుతన్న ఈ ప్లాట్‌ఫామ్‌లు మనలో ఒంటరితనం, అసంతృప్తిని పెంచేలా మారాయ‌ని నిపుణులు చెబుతున్నారు. మనం ఎక్కువగా “ఆన్‌లైన్” లో ఉండాలన్న ఒత్తిడి, ఇతరులతో పోల్చుకోవ‌డం వంటి అంశాలు మానసిక స్థితిని దెబ్బతీస్తున్నాయని అంటున్నారు.

నిరంతరం లైక్స్‌, కామెంట్స్‌, షేర్స్‌ కోసం ఎదురు చూస్తూ ఉండటం వల్ల ఆందోళన పెరుగుతోంది. నిద్రలేమి, ఒంటరితనంతో కూడిన జీవితం పెరుగుతోంది. ముఖ్యంగా టీనేజ్‌, యువత ఎక్కువగా బాధపడుతున్నారని అధ్య‌య‌నంలో తేలింది. సోష‌ల్ మీడియా అతి వినియోగంతో ఒత్తిడి పెరిగే అవ‌కాశం ఉంద‌ని చైల్డ్ మైండ్ ఇన్‌స్టిట్యూట్ అధ్య‌య‌నంలో వెల్ల‌డించారు.

37
దూర‌మ‌వుతోన్న అనుబంధాలు

స్నేహితుల ఫోటోలు, సెల్ఫీలు చూసి మనకు కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఇది నిజమైన అనుభూతి కాదు. సోష‌ల్ మీడియాలో చేస్తున్న పోస్టుల‌ను చూసి వారి జీవితాలు మనకంటే బాగున్నాయన్న అభ‌ద్ర‌తాలోకి వెళ్తున్నాం. దీంతో బంధాల మ‌ధ్య దూరం పెరుగుతోంది.

47
పెరుగుతోన్న డిప్రెష‌న్, యాంగ్జైటీ, ఫోమో

ఫోమో ‘FOMO’ అంటే Fear of Missing Out. ఇతరులు ఎక్కడైనా ఎంజాయ్ చేస్తున్నారేమో అన్న భయం. సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల ఈ ట్రెండ్ ఎక్కువుతోంది. ఇత‌రులు మ‌న‌కంటే బాగున్నారు, ఎంజాయ్ చేస్తున్నార‌న్న భావ‌న మ‌న‌లో అసంతృప్తిని పెంచుతుంది. సోషల్ మీడియాను అధికంగా వాడేలా చేస్తుంది. ఫ‌లితంగా అసలు జీవితాన్ని ఆస్వాదించకుండా చేస్తుంది.

57
ఇత‌రుల‌తో పోల్చుకోవ‌డం

ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్ లాంటి యాప్స్ అసలైన అందాన్ని కాకుండా తప్పుడు అందాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఫిల్టర్లు, ఎడిటింగ్ టూల్స్ వాడ‌డంతో ఇత‌రులు అందంగా క‌నిపిస్తారు. దీంతో ఇత‌రుల‌తో పోల్చుకోవ‌డం, మ‌న రూపంపై మ‌న‌కే అసంతృప్తి పెరుగుతుంది, సెల్ఫ్ రెక్సెప్ట్ త‌గ్గుతుంది.

67
సోష‌ల్ మీడియాను ఎలా స‌ద్వినియోగం చేసుకోవాలి.

సోషల్ మీడియా హానికరం కాదు. దాన్ని ఎలా వాడుతున్నామనే దానిపై మన జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మన మానసిక ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

77
పాటించాల్సిన నియమాలు

* రోజుకు 1–2 గంటల సమయాన్ని మాత్రమే కేటాయించాలి.

* ఫోన్ సెట్టింగ్స్ లో టైమ్ లిమిట్‌ పెట్టుకోవాలి

* కచ్చితమైన టైమ్‌లు వేసుకొని ఆ సమయం మాత్రమే వాడాలి

* మిమ్మ‌ల్ని ఇబ్బంది పెడుతున్న పోస్టులు చేసే యూజ‌ర్ల‌ను అన్‌ఫాలో చేయండి.

Read more Photos on
click me!

Recommended Stories