ఎలాన్ మస్క్ మరో సంచలనం.. ఉచితంగా ఆ ఏఐ సేవలు

Published : Aug 29, 2025, 02:24 PM IST

నిత్యం ఏదో ఒక సంచనలంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తుంటారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ట్విట్టర్‌ను కొనుగోలు చేసి ఎక్స్‌గా పేరు మార్చిన మ‌స్క్ ఇప్పుడు ఏఐ సేవ‌ల‌ను సైతం విస్త‌రిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 

PREV
15
ఉచితంగా ఏఐ టూల్

ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్న ఎలాన్ మస్క్, తన కొత్త AI టూల్ Grok Imagine ను ఇకపై అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది ముందుగా కేవలం డ‌బ్బులు చెల్లించిన వారికి మాత్ర‌మే అందుబాటులో ఉండేది. ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్, ఆర్టిస్టులు, మార్కెటింగ్ నిపుణులు అందరికీ ఇది ఒక పెద్ద వరంగా మారింది.

25
Grok Imagine అంటే ఏమిటి?

Grok Imagine అనేది అత్యాధునిక AI ఆధారంగా పనిచేసే టూల్. ఇది కేవలం కొన్ని సెకన్లలోనే చిత్రాలు, చిన్న వీడియోలు సృష్టిస్తుంది. ఎలాన్ మస్క్ స్వయంగా తన X అకౌంట్ ద్వారా ఈ ప్రకటన చేశారు. గత సంవత్సరం తీసుకొచ్చిన ఈ టూల్, తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదరణ పొందింది.

35
Grok Imagine ప్రత్యేకతలు

ఈ టూల్‌లో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:

* వివిధ రంగాలకు అనుగుణంగా ఉన్నతమైన చిత్రాలు సృష్టించడం.

* గరిష్టంగా 6 సెకన్ల వీడియోలు సంగీతం/వాయిస్‌తో తయారు చేయడం.

* టెక్స్ట్ ఆధారంగా చిత్రాలను ఎడిట్ చేయగలగడం.

* ఫొటోల క్వాలిటీ ఏమాత్రం త‌గ్గ‌కుండా ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ జోడించడం.

* వ్యాపారాలు, డెవలపర్ల కోసం API సపోర్ట్ అందుబాటులో ఉండటం.

ఈ ఫీచర్లతో యూజర్లు తమ ఆలోచనలను తక్షణమే విజువల్స్ రూపంలోకి మార్చుకోవచ్చు.

45
యూజ‌ర్లు ఏమంటున్నారంటే.?

Grok Imagine ఉచితంగా అందుబాటులోకి రావడంతో, ప్రపంచవ్యాప్తంగా యూజర్లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కంటెంట్ క్రియేటర్ విక్టోరియా హారిసన్: “నా డైలీ కంటెంట్ క్రియేషన్‌లో ఇది ఒక విప్లవం. నా ఆలోచనలను వెంటనే వీడియోలుగా మార్చేస్తోంది” అని అన్నారు. మార్కెటింగ్ మేనేజర్ మైఖేల్ విలియమ్స్ మాట్లాడుతూ.. “మా అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్‌కి ఇది బాగా సహకరిస్తోంది. స‌మ‌యం ఆదా అవుతోంది, క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాదు” అని వ్యాఖ్యానించారు.

55
అందరికీ AI శక్తి

ఎలాన్ మస్క్ ఈ నిర్ణయం ద్వారా AI ఆధారిత క్రియేటివిటీని ప్రజలందరికీ చేరవేసే ప్రయత్నం చేశారు. ఇది ప్రత్యేకించి సోషల్ మీడియా, బ్రాండింగ్, మార్కెటింగ్, వినోద రంగాల్లో పెద్ద మార్పులు తీసుకువస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories