వాట్సాప్ ఛానెల్‌లో చేరడం వల్ల యూజర్ ప్రైవసీ కోల్పోతుందా.. ? కొత్త అప్‌డేట్‌లో ఏముంది?

First Published | Sep 25, 2023, 2:49 PM IST

ఇన్స్టంట్ మెసేజింగ్  యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను  తీసుకొస్తుంది, అదేంటంటే వాట్సాప్  ఛానెల్ ఫాలోవర్స్  ఛానెల్‌లోని  మెసేజెస్ కి రెస్పాండ్  అవడానికి  స్సహాయపడుతుంది.
 

వాట్సాప్ తాజాగా ఛానెల్స్ అనే కొత్త ఫీచర్స్  పరిచయం చేసిన సంగతి మీకు తెల్సిందే. ఈ ఫీచర్  ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ ఫీచర్  లాగ ఉంటుంది. వాట్సాప్ యూజర్లు వారికీ ఇష్టమైన ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు ఇంకా ఛానెల్ మెసేజెస్  చూడవచ్చు. అంతేకాదు  యూజర్లకు  ప్రైవసీ, రియాక్షన్స్, ఛానెల్ పోస్ట్స్  ఆండ్ ఇతర ఫీచర్స్ తో సహా ఎన్నోఇన్స్టంట్ మెసేజింగ్  యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను  తీసుకొస్తుంది, అదేంటంటే వాట్సాప్  ఛానెల్ ఫాలోవర్స్  ఛానెల్‌లోని  మెసేజెస్ కి రెస్పాండ్  అవడానికి  స్సహాయపడుతుంది. ఇప్పుడు ఛానెల్ అలర్ట్ అనే మరో ఫీచర్ వచ్చింది. అలాగే పోస్ట్‌లకు రిప్లయ్  ఇచ్చే ఫీచర్‌ను కూడా ఛానెల్ పరీక్షిస్తోంది.

ఆండ్రాయిడ్‌లోని బీటా యూజర్లు 2.23.20.9 అప్‌డేట్‌తో ఈ ఫీచర్‌ను పొందుతారు. ఇందులో కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఛానెల్ క్రియేటర్స్ వారి  ఛానెల్‌ల స్టేటస్  గురించి తెలుసుకోవడానికి ఈ కొత్త ఫీచర్ రూపొందించబడింది.

వివిధ దేశాల అక్కడి  చట్టాల కారణంగా కొన్ని దేశాల్లో కొన్ని ఛానెల్‌లను చూడలేరు. కొన్ని ఛానెల్‌లు ఆయా దేశాల చట్టాల ద్వారా పరిమితం చేయబడ్డాయి. కొత్త అప్‌డేట్‌లో అటువంటి లిమిటెడ్  ఛానెల్‌ల క్రియేటర్స్ వాటి గురించి వివరాలను పొందగలిగే ఫీచర్‌ 
 ఉంది.
 


ఈ విధంగా ఏదైనా కొత్త దేశంలో ఛానెల్ ఆక్టివిటీ  పరిమితం చేయబడితే, దాని గురించి ఛానెల్ క్రియేటర్ కి  తెలియజేస్తుంది. ఛానెల్ ఆక్టివిటీ పరిమితం చేయబడిన దేశంలో ఫోన్ నంబర్‌ ఉన్న యూజర్లు ఛానెల్‌ని యాక్సెస్ చేయలేరు లేదా ఫాలో చేయలేరు అని దీని అర్థం.
 

దీనితో పాటు, ఛానెల్ పోస్ట్‌లకు రిప్లై చేసే ఫీచర్ గురించి కూడా సమాచారం ఉంది. ఈ ఫీచర్ రాబోయే అప్‌డేట్‌లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. "వాట్సాప్ కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది, ఛానెల్‌లను ఫాలో చేసేవారు ఛానెల్‌లలోని మెసేజెస్ కి  రియాక్ట్ అవడానికి వీలు కల్పిస్తుంది" అని తెలిపింది.
 

ఒక ఛానెల్‌లోని మెసేజ్ కి ఎన్ని రిప్లయ్స్ వచ్చాయో కూడా మీరు చూడవచ్చు. ఛానెల్ ఫాలోవర్స్ గురించి మొబైల్ నంబర్ వంటి ప్రైవేట్ సమాచారాన్ని ప్రైవసీగా ఉంచడానికి WhatsApp ప్రైవసీ హామీని కూడా అందిస్తుంది.

Latest Videos

click me!