రెడ్ మీ నుండి కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్స్..! రోజంతా బ్యాటరీ లైఫ్‌తో మూడు అమేజింగ్ మోడల్స్ ! ఓ లుక్కేయండి..

First Published | Sep 25, 2023, 2:13 PM IST

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్ మీ నోట్  13 సిరీస్ ని  తాజాగా చైనాలో ప్రవేశపెట్టింది. ఈ సిరీస్‌లో రెడ్ మీ నోట్ (Redmi Note 13), రెడ్ మీ నోట్ ప్రో (Redmi Note 13 Pro), రెడ్ మీ నోట్ (Redmi Note 13 Pro+) ప్రో  ప్లస్ అనే మూడు మోడల్‌లు ఉన్నాయి. ఇంతకుముందు మూడు మోడల్స్‌తో లాంచ్  చేసిన రెడ్‌మీ నోట్ 12కి రెడ్‌మి నోట్ 13 సక్సెసర్ మోడల్.
 

చైనాలోని Xiaomi వెబ్‌సైట్‌లో ఈ ఫోన్స్  సెప్టెంబర్ 26 నుండి విక్రయించనుంది. ఈ మూడు నోట్ 13 మోడల్స్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌తో  రోజంతా ఉండే బ్యాటరీతో  వస్తాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

రెడ్‌మీ నోట్ 13
రెడ్‌మీ నోట్ 13 6GB + 128GB మోడల్ ధర దాదాపు INR 13,900. అదేవిధంగా 8GB + 128GB మోడల్ ధర  రూ. 15,100, 8GB + 256GB మోడల్ ధర  రూ.17,400. 12GB + 256GB మోడల్ ధర రూ.19,700.

Redmi Note 13 మోడల్ బ్లాక్, బ్లు అండ్  వైట్  కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, MediaTek Dimensity 6080 ప్రాసెసర్, Android 13-బేస్డ్ MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. వెనుకవైపు ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్‌లో 100-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.  33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

Redmi Note 13 Pro

Redmi Note 13 Pro  8GB + 128GB మోడల్‌ ధర రూ. 17,400,  8GB + 256GB మోడల్‌ ధర  రూ. 19,700కి అందుబాటులో ఉన్నాయి. 12GB + 256GB మోడల్ ధర రూ. 22,000 అండ్ 12GB + 512GB మోడల్ ధర రూ.23,100. 16GB + 512GB మోడల్ ధర రూ.24,300.
 


ప్రో మోడల్ బ్లాక్, బ్లు, సిల్వర్ అండ్ వైట్ కలర్స్ లో  అందుబాటులో ఉంది. ప్రో మోడల్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో 6.67-అంగుళాల 1.5K ఫుల్ HD + AMOLED డిస్‌ప్లే, Qualcomm Snapdragon ప్రాసెసర్‌తో Android 13 బేస్డ్  MIUI 14, వెనుక కెమెరాలో 200-మెగాపిక్సెల్ Samsung ISOCELL HP3 ప్రైమరీ లెన్స్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఇంకా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఉన్నాయి. ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు.  67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,100mAh బ్యాటరీ దీనిలో  ఉంది.
 

రెడ్ మీ నోట్ 13 ప్రో+

రెడ్ మీ నోట్ 13 Pro ప్లస్ మొబైల్ 12GB + 256GB, 12GB + 512GB ఇంకా 16GB + 512GB అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు  రూ.22,800, రూ.25,100 అండ్ రూ.26,200.
 

Pro ప్లస్ మోడల్ బ్లాక్, సిల్వర్ అండ్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రో ప్లస్  మోడల్‌లో ప్రో మోడల్‌కు సమానమైన డిస్‌ప్లే, ప్లాట్‌ఫారమ్, స్టోరేజ్ అప్షన్  అండ్ కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. MediaTek Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్ కూడా ఉంది.  120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

Latest Videos

click me!