డి‌ఎస్‌ఎల్‌ఆర్ వంటి కెమెరాతో ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్.. సోని IMX709 సెన్సార్‌తో ప్రపంచంలోనే మొదటి ఫోన్‌..

First Published Jan 21, 2022, 2:38 AM IST

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ  ఒప్పో (Oppo) కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఒప్పో రెనో 7(oppo reno 7) భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది, అయితే ఈ సిరీస్ లాంచ్ తేదీ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

ఈ సిరీస్ కింద ఒప్పో రెనో 7 5జి, ఒప్పో రెనో 7 ప్రొ 5జి, ఒప్పో రెనో 7ఎస్‌ఈ 5జి స్మార్ట్‌ఫోన్‌లు గత సంవత్సరం చైనాలో లాంచ్ అయ్యాయి. కొద్దిరోజుల క్రితం  ఒప్పో రెనో 7 సిరీస్  భారతీయ ధర లీక్ అయ్యింది. ఒప్పో రెనో 7 సిరీస్ డిజైన్  ఐఫోన్ 13 (iPhone 13) సిరీస్‌ని పోలి ఉంటుంది.  ఒప్పో రెనో 7 సిరీస్ సెల్ ఫ్లిప్ కర్ట్ (Flipkart) ద్వారా జరగనుంది.

ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్ ఒప్పో ఇండియా వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. ఒప్పో రెనో 7 సిరీస్ ఫోన్‌లు Sony IMX709 (32-మెగాపిక్సెల్) సెన్సార్‌ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొదటి ఫోన్‌లు అవుతాయని ఒప్పో పేర్కొంది. 
 

ఒప్పో రెనో 7 సిరీస్ కోసం కంపెనీ #ThePortraitExpert క్యాంపైన్ ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో టీజర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. భారతదేశంలో ఒప్పో రెనో 7 సిరీస్ ప్రారంభ ధర రూ. 28,000.

ఒప్పో రెనో 7 5జి స్పెసిఫికేషన్లు
ఒప్పో రెనో 7 5జిలో ఆండ్రాయిడ్ 11 ఆధారిత ColorOS 12 ఉంది. ఇది కాకుండా 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల పూర్తి HD ప్లస్ AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్, 12జి‌బి వరకు LPDDR4x ర్యామ్,256 జి‌బి వరకు స్టోరేజ్ ఉంది. ఇంకా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఇచ్చారు, దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్. 
 

రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రో, సెల్ఫీ కోసం 32-మెగాపిక్సెల్ సోనీ IMX709 సెన్సార్ ఇచ్చారు. కనెక్టివిటీ కోసం 5G, 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS / A-GPS, NFC అండ్ USB టైప్-సి పోర్ట్‌ లభిస్తాయి. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇంకా 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500mAh బ్యాటరీ ఉంది.

click me!