టెక్నో పోవా నియోలో Android 11 ఆధారిత HiOS 7.6 ఇచ్చారు. అంతేకాకుండా 720×1640 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల HD+ డిస్‌ప్లే, డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz ఇంకా దాని బ్రైట్ నెస్ 480 నిట్స్, డిస్ ప్లే డిజైన్ పంచ్ హోల్. ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి25 ప్రాసెసర్ లభిస్తుంది. అలాగే 6 జిబి ర్యామ్ తో 128 జిబి స్టోరేజ్ పొందుతుంది.
కెమెరా
కెమెరా గురించి మాట్లాడితే ఈ ఫోన్ లో డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 13 మెగాపిక్సెల్‌లు. ఇతర లెన్స్‌ల గురించి సమాచారం ఇవ్వలేదు. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. రెండు కెమెరాలతో పాటు క్వాడ్ ఫ్లాష్ లైట్, ముందు భాగంలో డ్యూయల్ ఫ్లాష్ కూడా ఉంటుంది.