మిమి ఆడియో టెక్నాలజీతో కాంపాక్ మొట్టమొదటి స్మార్ట్ టీవీ.. ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్ డేట్ కూడా..

First Published | Jul 21, 2021, 1:04 PM IST

అమెరికన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజి సంస్థ కాంపాక్ కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ హెక్స్ 65 కోసం ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ 9.0 తో  వస్తుంది. తాజాగా కాంపాక్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మిమి ఆడియో టెక్నాలజీతో స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టారు.  

ఒక వ్యక్తి నిర్దిష్ట వినికిడికి సౌండ్ అందించే అవార్డు గెలుచుకున్న టెక్నాలజి. ఇది సౌండ్ తీవ్రత, డెలివరీ మెకానిజం కూడా పరిగణనలోకి తీసుకుంటుంది ఇంకా మీరు టీవీని ఎంతసేపు చూసినా గొప్ప టీవీ అనుభవాన్ని ఇస్తుంది. మిమి సౌండ్ పర్సనలైజేషన్ స్మార్ట్ టీవీల్లోని ప్రత్యేక బయో-అల్గోరిథం ఆధారంగా మిమి యాప్ ద్వారా సౌండ్ కి మానవ ప్రతిస్పందనను ఆప్టిమైజ్ చేస్తుంది. లేటెస్ట్ ఆడియాలజీ పరిశోధన ఆధారంగా ఈ టెక్నాలజి వినియోగదారుల వినికిడిని అంచనా వేస్తుంది, తదనుగుణంగా సౌండ్ ఎంచుకుంటుంది, ఆపై తగిన సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది.
undefined
ఈ ఉత్పత్తిపై కంపెనీ చైర్మన్ సందీప్ కుమార్ మాట్లాడుతూ “కాంపాక్ టివిలు భారతీయ వినియోగదారులకు అత్యంత అధునాతన, వినూత్న టెక్నాలజి అనుభవాన్ని అందిస్తాయి. మేము సింపుల్, యూనిక్ హోమ్ ఎంటర్టైన్మెంట్ అనుభవాన్ని అందించాలని, ఆండ్రాయిడ్ 9.0 చేత శక్తినిచ్చే హెక్స్ 65 క్యూఎల్‌ఇడి టీవీలతో ప్రతి కుటుంబ అవసరాలను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము అని అన్నారు.
undefined

Latest Videos


కాంపాక్ హెక్స్ 65 టెలివిజన్ ఫీచర్లుస్లిక్ డిజైన్ - ఈ టీవీ వీక్షణ అనుభవాన్ని ఆకర్షణీయమైన డిజైన్, పెద్ద స్క్రీన్ తో ప్రత్యేకంగా చేస్తుంది. దీనికి బెజెల్ లెస్ స్క్రీన్ అండ్ ఆల్-మెటల్ బాడీ ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ స్టాబిలైజేషన్ ఇంజన్ డైనమిక్ ఫ్రేమ్ ట్రాన్సిషన్ ఉపయోగించే కొత్త అల్గోరిథం ఎటువంటి అస్పష్టత లేదా లాగ్ లేకుండా వేగవంతమైన యాక్షన్ సన్నివేశాలను చూడవచ్చు.
undefined
వైడ్ కలర్ గాముట్ ప్లస్- ఎల్‌ఈ‌డి బ్యాక్‌లైట్‌తో ఈ టీవీ మిమ్మల్ని ఆకర్షణీయమైన డిస్ ప్లే పనితీరుతో కట్టిపడేస్తుంది. ఇంకా ప్రకాశవంతమైన, అద్భుతమైన రంగులలో ప్రతి సన్నివేషం మీకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ టి‌వి 1.07 బిలియన్ రంగులను అందించగలదు.
undefined
4కే యూ‌హెచ్‌డి డిస్ ప్లే - 4కే యూ‌హెచ్‌డి డిస్ ప్లే ప్రతి దానికి లైఫ్ తెస్తుంది. మీ వీక్షణ అనుభవాన్ని అసాధారణంగా చేస్తుంది. లైట్ అండ్ డార్క్ షేడ్‌లతో స్పష్టమైన చిత్రాలను, నిజమైన రంగులను అందించడంలో హెచ్‌డి‌ఆర్10 టెక్నాలజీ విజయవంతమైందని నిరూపిస్తుంది.
undefined
గూగుల్ అసిస్టెంట్ - గూగుల్ అసిస్టెంట్ ఉపయోగించి మీ వాయిస్‌తో టైం లీ అప్ డేట్ తో మీ రోజును ప్లాన్ చేసే టిప్స్ పొందవచ్చు. గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేక బటన్ కూడా టీవీ రిమోట్ లో ప్రవేశపెట్టారు. మీ ఫోన్ స్క్రీన్‌ను మిర్రరింగ్ ద్వారా మీకు ఇష్టమైన కంటెంట్‌ను సులభంగా ప్లే చేయవచ్చు.
undefined
కాంపాక్ టెలివిజన్ ని మొదట 2020 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులో ఉంది. దీని ధర రూ .99,999. దీనికి 24W స్పీకర్ లభిస్తుంది.
undefined
click me!