పెగసాస్ స్పైవేర్ అంటే ఏమిటి..? ఇది మీ ఫోన్‌లో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి..

Ashok Kumar   | Asianet News
Published : Jul 20, 2021, 11:29 AM IST

భారతదేశంలో ఆదివారం రాత్రి నుంచి  ఒక నివేదిక కలకలం రేపింది. ది గార్డియన్ అండ్ ది వాషింగ్టన్ పోస్ట్ తో సహా 16 మీడియా సంస్థల జాయింట్  నివేదిక 2017 నుండి 2019 మధ్య భారత ప్రభుత్వం 300 మంది భారతీయ మొబైల్ నంబర్లపై గూఢచర్యం చేసిందని పేర్కొంది. 

PREV
16
పెగసాస్ స్పైవేర్   అంటే ఏమిటి..? ఇది మీ ఫోన్‌లో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి..

 వీరిలో జర్నలిస్టులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారని అంతేకాకుండా పెగాసస్ స్పైవేర్ ద్వారా ప్రభుత్వం వీరి ఫోన్‌లను హ్యాక్ చేసిందని తెలిపింది. ఈ నివేదిక తరువాత ప్రభుత్వం ఈ ఆరోపణలలో నిజం లేదని స్పష్టం చేసింది. పెగసాస్ స్పైవేర్ ని అభివృద్ది చేసిన సంస్థ కూడా ఈ నివేదికలు  ఖండించినట్లు పేర్కొంది.  

26

పెగసాస్ స్పైవేర్  ఒకరి ఫోన్‌కు ఎలా చేరుతుంది?
 పెగాసస్ ని ఏదైనా  ఫోన్‌లోనైనా లేదా మరే ఇతర డివైజెస్ లో రిమోట్‌గా ఇన్‌స్టాల్ చేయవచ్చు. మిస్డ్ కాల్ చేయడం ద్వారా లేదా  మీ ఫోన్‌కు వాట్సాప్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్, సోషల్ మీడియా ద్వారా కూడా చెరవచ్చు.
 
36

పెగాసస్ ద్వారా మీ ఫోన్ ట్రాక్ అవుతుందో లేదో ఎలా తెలుసుకోవాలి?
 మీ ఫోన్‌లో ఏదైనా వింతగా జరుగుతుంటే మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ ఫోన్ ని పర్యవేక్షించడం ద్వారా కూడా ఈ వైరస్ ని కనుగొనవచ్చు, అయినప్పటికీ మీరు ఏం  చేయలేరు. ఎందుకంటే ఇందుకోసం మీరు ల్యాబ్ సహాయం తీసుకోవాలి. ప్రాసెస్ మానిటరింగ్‌తో మీ ఫోన్‌లో ఎంత ట్రాఫిక్ ఉందో ఇంకా డేటా ఎక్కడ బదిలీ అవుతుందో తెలుసుకోవచ్చు. ఫోన్‌లో పెగసాస్ ఉనికి గురించి సమాచారం ప్రాసెస్ మానిటరింగ్ లేదా ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, ఎందుకంటే ఈ సాఫ్ట్‌వేర్ గూఢచర్యం చేయడానికి చాలా తెలివైనది. ప్రాసెస్ పర్యవేక్షణ అంటే ఫోన్  పనిచేసే ప్రక్రియను పర్యవేక్షించడం. ప్రాసెస్ మానిటరింగ్‌తో, మీరు చేయని మీ ఫోన్‌లో ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు.
 
46

పెగాసస్‌ను  ఇతర సాఫ్ట్‌వేర్ ద్వారా ట్రాక్ చేయవచ్చా?
పెగాసస్‌ను మరే ఇతర సాఫ్ట్‌వేర్ ద్వారా ట్రాక్ చేయలేము. పెగసాస్‌ను అన్ని రకాల వైరస్ లకు తండ్రి అని పిలుస్తారు. పెగసాస్ కోడింగ్ చాలా బలంగా ఉంటుంది, ఇది యాంటీవైరస్ ని కూడా దాటవేయగలదు.

56

 ఫోన్‌లో పెగసాస్ ఏం చేయవచ్చు?
పెగాసస్ మీ ఫోన్‌లో మీరు చేసే అన్ని పనులను చేస్తుంది. మీ కెమెరాను ఓపెన్ చేయడం ద్వారా ఫోటోను క్లిక్ చేయవచ్చు. మెసేజెస్ పంపవచ్చు, క్యాలెండర్ చెక్ చేయవచ్చు. ఇ-మెయిల్ నుండి బ్యాంక్ యాప్స్ వరకు, మీరు పూర్తి సమాచారాన్ని తీసుకుంటుంది. అలాగే మైక్రోఫోన్‌ను హాయిగా యాక్సెస్ చేయగలదు. వాట్సాప్ అండ్ ఐమెసెంజర్ వంటి ఎన్ క్రిప్టెడ్ యాప్స్ నుండి చాట్‌లను కూడా చదవగలదు. ప్రాసెస్ మానిటరింగ్ లేదా ఫోరెన్సిక్ ల్యాబ్స్ సహాయం లేకుండా గుర్తించలేని విధంగా చాలా ఖచ్చితత్వంతో చేస్తుంది.

66

పెగసాస్ నుండి తప్పించుకోవడానికి మార్గం ఏమిటి?
దీని నుండి తప్పించుకోవడానికి, నివారించడానికి మార్గం లేదు.  దీని కోసం యాప్ లేదా డివైజ్ అప్ డేట్ చాలా ముఖ్యం. అప్ డేట్ వచ్చినప్పుడల్లా ఫోన్‌ను అప్ డేట్ చేయండి, సెక్యూరిటి ప్యాచ్‌ను కూడా అప్ డేట్ చేయండి, తెలియని నంబర్ల నుండి లింక్‌లు, మెసేజులు మొదలైనవి ఓపెన్ చేయవద్దు, రిప్లయి కూడా ఇవ్వవద్దు, విదేశీ నంబర్‌ల నుండి కాల్స్ స్వీకరించవద్దు, సోషల్ మీడియాలో అనుమానాస్పద మెసేజుల నుండి దూరంగా ఉండండి. ఫోన్ ప్రక్రియను పర్యవేక్షించగల మంచి యాంటీవైరస్ వాడండి.
 
click me!

Recommended Stories