ఏఐని ఈ విషయాలు అడిగారో.. అంతే సంగతి
మనకు సమస్త సమాచారం అందించే ఇవే చాట్‌జీపీటీ, జెమిని వంటి ఏఐ చాట్ బాట్స్ కొన్ని సందర్భాల్లో సమస్యలకు కారణం కావచ్చు. ఇవి కొన్నిసార్లు మనం జైలుపాలు అవ్వడానికి కూడా కారణం కావొచ్చని తెలుసా? ఈ విషయంపై పోలీసులు హెచ్చరిక జారీ చేశారు.
అన్ని ప్రశ్నలకు చాట్‌జీపీటీలో సమాధానాలు వెతకడం ఇప్పుడు సాధారణమైపోయింది. కొందరైతే స్నేహితులు లేక తమ మాట వినే చాట్‌జీపీటీనే ఫ్రెండ్‌గా భావించి మాట్లాడుతున్నారు. మరికొందరు దీన్ని తమ లవర్‌లా భావించి రోజూ ఛాటింగ్ చేస్తున్నారు. ఇలా సరదాకో, కావాలనో నేరాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే మీ కథ కంచికే.
‘’ఏఐతో చాట్ చేసే అంశాలు నాకు తప్ప ఎవరికీ తెలియవు'' అని చాలామంది అనుకుంటారు. కానీ ఏఐ చాట్ బాట్స్ మనకంటే చాలా తెలివైనవి… మనం ఎలాంటి అనుమానాస్పద ప్రశ్నలు అడిగినా, అది మీరు కామెడీ కోసం అడుగుతున్నారా లేక నిజంగానే అడుగుతున్నారా అని చూడదు. మీ ప్రశ్నలు నేరుగా క్రైమ్ బ్రాంచ్‌కు వెళ్తాయి. పదే పదే ఇలాంటి ప్రశ్నలు అడిగితే, పోలీసులు నేరుగా మీ ఇంటి తలుపు తట్టవచ్చు.