Diwali Offer: దీపావళి పండగ వేళ మొబైల్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు రీఛార్జ్ టెన్షన్ లేకుండా ఉండాలనుకునే వారికి BSNL బంపర్ ఆఫర్ తెచ్చింది. ఒక్క రీఛార్జ్ తో 395 రోజుల ప్లాన్. మరి ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందామా..
మొబైల్ రీఛార్జ్ ఖర్చులు పెరుగుతున్నాయా? ప్రతినెలా రీఛార్జ్ చేయించుకోవడం ఇబ్బందిగా ఉందా? అయితే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. ఒకేసారి రీఛార్జ్ చేసుకుంటే ఏకంగా 395 రోజుల పాటు వ్యాలిడిటీ పొందే అవకాశం కల్పిస్తోంది. అది కూడా రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS ప్రయోజనాలతో. మరి ఆలస్యమెందుకు రీఛార్జ్ గురించిన పూర్తి వివరాలు చూసేయండి.
26
రూ.2,799 రీఛార్జ్ ప్లాన్
BSNL దీపావళి ఆఫర్ లో భాగంగా రూ.2,799 వార్షిక ప్లాన్‌పై అదనంగా 30 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. సాధారణంగా ఈ ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుండగా.. ఇప్పుడు మరో 30 రోజులు ఉచితంగా జత చేస్తోంది. దీంతో మొత్తం వ్యాలిడిటీ 395 రోజులకు చేరింది. అంటే ఏడాదితో పాటు మరో నెల రోజులు అదనంగా ఎలాంటి కొత్త రీఛార్జ్ అవసరం లేకుండా సేవలను ఉపయోగించుకోవచ్చు.
36
రోజుకు 3GB డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్
ఈ రూ.2,799 ప్లాన్‌లో కేవలం ఎక్కువ రోజులు వ్యాలిడిటీ మాత్రమే కాదు.. డేటా, కాలింగ్, SMS ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఈ ప్లాన్‌లో లభించే ప్రయోజనాలు..
రీఛార్జ్ ధర: రూ.2,799
మొత్తం వ్యాలిడిటీ: 395 రోజులు
అదనపు వ్యాలిడిటీ: 30 రోజులు
డేటా: రోజుకు 3GB
వాయిస్ కాల్స్: అన్‌లిమిటెడ్
SMS: రోజుకు 100
రోజువారీ డేటా అవసరాలు ఎక్కువగా ఉండే వారికి, నిరంతరం ఫోన్ కాల్స్ మాట్లాడే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ ప్లాన్‌లో రూ.2,799 చెల్లించి 395 రోజుల వ్యాలిడిటీ పొందితే.. రోజుకు సగటున సుమారు రూ.7.09 మాత్రమే ఖర్చవుతుంది. దీర్ఘకాలిక వ్యాలిడిటీ కోరుకునే వినియోగదారులకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా చెప్పవచ్చు.
56
ఆఫర్ చివరి తేదీ ఎప్పుడంటే?
BSNL ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్ 30 నవంబర్ 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే ఈ తేదీలోపు అర్హత కలిగిన రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు 365 రోజులకు అదనంగా 30 రోజుల వ్యాలిడిటీ ప్రయోజనాన్ని పొందవచ్చు.
66
BSNLకి మారాలనుకునే వారికి మంచి అవకాశం!
ప్రస్తుతం వేర్వేరు టెలికాం సంస్థల రీఛార్జ్ ప్లాన్‌లను పరిశీలిస్తున్న వారికి BSNL ఆఫర్ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ముఖ్యంగా తరచూ రీఛార్జ్ చేసుకోవడం ఇష్టంలేని వారు, ఎక్కువ డేటా వినియోగించే వారు ఈ ప్లాన్ వివరాలను పరిశీలించవచ్చు. అయితే రీఛార్జ్ చేసుకునే ముందు మీ ప్రాంతంలో BSNL నెట్‌వర్క్ కవరేజ్, 4G సేవల లభ్యత, ప్లాన్‌కు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.