WhatsApp Scheduled Messages: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. మెసేజ్‌లు షెడ్యూల్ చేయడం ఎలాగంటే?

Published : Oct 13, 2026, 12:35 PM IST

WhatsApp Scheduled Messages: వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వర్షన్‌లో మెసేజ్ షెడ్యూలింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. టెక్స్ట్, ఫొటోలు, వీడియోలను ముందుగానే టైమ్ సెట్ చేసి పంపడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
మతిపోయే అప్‌డేట్ ఇచ్చిన వాట్సాప్

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో సూపర్ ఫీచర్‌ను పరిచయం చేయడానికి సిద్ధమైంది. సుదీర్ఘకాలంగా యూజర్లు కోరుకుంటున్న షెడ్యూల్డ్ మెసేజెస్ ఫీచర్‌ను వాట్సాప్ ప్రస్తుతం పరీక్షస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ టెక్స్ట్ మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు లేదా లింక్‌లను ముందుగానే డ్రాఫ్ట్ చేసి, కావలసిన తేదీ, సమయానికి ఆటోమేటిక్‌గా వెళ్లేలా సెట్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ కొత్త ఆప్షన్ ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. రాబోయే కొద్ది వారాల్లో మరింత మందికి ఈ ఫీచర్‌ను విస్తరించేందుకు వాట్సాప్ ప్లాన్ చేస్తోంది.

26
అసలు ఏమిటి ఈ షెడ్యూల్డ్ మెసేజెస్ ఫీచర్?

వాట్సాప్‌లో రోజువారీ చాట్స్ మాత్రమే కాకుండా వ్యాపార ప్రకటనలు, పుట్టినరోజు శుభాకాంక్షలు, రిమైండర్‌లు వంటివి పంపడం సాధారణం. అయితే సరైన సమయానికి మెసేజ్ పంపడం ఒక్కోసారి వీలుకాకపోవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికే వాట్సాప్ ఈ షెడ్యూలింగ్ టూల్‌ను అభివృద్ధి చేసింది.

టెలిగ్రామ్ వంటి ప్రత్యర్థి యాప్‌లలో ఈ ఫీచర్ 2019 నుంచే అందుబాటులో ఉన్నప్పటికీ, వాట్సాప్‌లో లేకపోవడం పెద్ద లోటుగా ఉండేది. ఇప్పుడు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఈ ఫీచర్‌ను తీసుకురావడం ద్వారా యూజర్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించినట్లయింది. వాట్సాప్ బీటా ఇన్ఫో అందించిన రిపోర్టుల ప్రకారం, ఆండ్రాయిడ్ బీటా వర్షన్ 2.26.40.7, 2.26.8.11 ఉపయోగిస్తున్న కొందరు టెస్టర్లకు ఈ అప్‌డేట్ అందింది.

36
వాట్సాప్‌లో మెసేజ్ ఎలా షెడ్యూల్ చేయాలి?

ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం. జీమెయిల్ లో ఉండే ఈమెయిల్ షెడ్యూలర్ తరహాలోనే ఇది కూడా పనిచేస్తుంది.

• స్టెప్ 1: మీరు ఎవరికైతే మెసేజ్ పంపాలనుకుంటున్నారో వారి పర్సనల్ చాట్ లేదా గ్రూప్ చాట్ ఓపెన్ చేయాలి.

• స్టెప్ 2: చాట్ బాక్స్‌లో మీ టెక్స్ట్ లేదా లింక్‌ను టైప్ చేయాలి.

• స్టెప్ 3: ఆ తర్వాత సెండ్ బటన్‌ను కొద్దిసేపు లాంగ్ ప్రెస్ చేయాలి.

• స్టెప్ 4: ఇలా చేయగానే స్క్రీన్ దిగువ భాగంలో డెలివరీ తేదీ, సమయాన్ని ఎంచుకోవడానికి ఒక పాపప్/డెలివరీ ఆప్షన్ కనిపిస్తుంది.

• స్టెప్ 5: మీకు కావలసిన తేదీ, సమయాన్ని ఎంచుకుని కన్ఫర్మ్ చేస్తే మెసేజ్ షెడ్యూల్ అయిపోతుంది.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ప్రస్తుత సమయం నుంచి కనీసం 10 నిమిషాల వ్యవధికి ముందుగా లేదా రెండు వారాల ముందు వరకు మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు.

46
ఫొటోలు, వీడియోలు కూడా షెడ్యూల్ చేయవచ్చా?

కేవలం సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లు మాత్రమే కాకుండా లింక్‌లు, ఫొటోలు, వీడియోలను కూడా షెడ్యూల్ చేసే వెసులుబాటును వాట్సాప్ కల్పించింది. మీరు ఏదైనా ఫొటో లేదా వీడియోను పంపాలనుకుంటే, గ్యాలరీ పిక్కర్ ద్వారా పంపాలనుకుంటున్న మీడియాని ఎంచుకోవాలి.

ఆ తర్వాత సదరు ఫొటోకు క్యాప్షన్ జోడించడం, ఎడిట్ చేయడం లేదా డ్రాయింగ్ ఎడిటర్‌లో మార్పులు చేయడం వంటివి పూర్తి చేసి, ఆపై సెండ్ బటన్‌పై లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా షెడ్యూల్ చేసుకోవచ్చు. అయితే ఒకేసారి ఒక ఫొటో లేదా వీడియోను మాత్రమే షెడ్యూల్ చేసేలా ప్రస్తుతం పరిమితి ఉన్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

56
ఫోన్ ఆఫ్‌లో ఉన్నా మెసేజ్ వెళ్తుందా?

ఈ ఫీచర్‌లో క్రేజీ ఏమిటంటే మెసేజ్ షెడ్యూల్ చేసిన తర్వాత, నిర్ణీత సమయానికి మీ ఫోన్ ఆఫ్‌లైన్‌లో ఉన్నా, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా లేదా వాట్సాప్ యాప్ క్లోజ్ చేసి ఉన్నా సరే, ఆటోమేటిక్‌గా మెసేజ్ పంపిన వాళ్లకు డెలివరీ అవుతుంది.

అలాగే, మీరు షెడ్యూల్ చేసిన మెసేజ్‌లను మేనేజ్ చేయడానికి వాట్సాప్ చాట్ ఇన్ఫో స్క్రీన్ లో ఒక ప్రత్యేకమైన సెక్షన్ ను అందిస్తోంది.

• క్యాన్సిల్/డిలీట్ ఆప్షన్: మెసేజ్ వెళ్లడానికి ముందే మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు.

• నోటిఫికేషన్లు ఉండవు: మీరు షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను డిలీట్ చేసినా, ఆ విషయం అందుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియదు లేదా వారికి ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లదు.

• గ్రూప్ చాట్‌లకు వర్తింపు: గ్రూప్ చాట్లలో మెసేజ్ షెడ్యూల్ చేసినప్పుడు, మీరు షెడ్యూల్ చేసిన సమయంలో ఆ గ్రూప్‌లో ఉన్న సభ్యులకు మాత్రమే అది వెళ్తుంది. ఆ తర్వాత కొత్తగా గ్రూప్‌లో చేరిన వారికి ఆ మెసేజ్ అందదు.

66
ఈ ఫీచర్ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

ఈ కొత్త షెడ్యూలింగ్ ఫీచర్ కూడా వాట్సాప్ ప్రామాణిక ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సెక్యూరిటీ రక్షణతోనే వస్తోంది. కాబట్టి మీ షెడ్యూల్డ్ మెసేజ్‌లు పూర్తి సురక్షితంగా ఉంటాయి.

ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లలో కొందరికి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. బీటా టెస్టింగ్‌లో అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం, రాబోయే వారాల్లో సాధారణ వినియోగదారులందరికీ ఈ అప్‌డేట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ, అధికారిక విడుదల తేదీపై వాట్సాప్ యాజమాన్యం ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు.

ఇటీవలే వాట్సాప్ టీనేజర్ల కోసం పేరెంటల్ కంట్రోల్స్, బిల్లుల చెల్లింపులు వంటి పలు కీలక ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా రానున్న ఈ షెడ్యూల్డ్ మెసేజెస్ ఫీచర్ యూజర్లకు ఎంతో ఉపయోగపడనుంది.

Read more Photos on
click me!

Recommended Stories