చాలా మంది ఇంట్లో రౌటర్ ఉంచే ప్రదేశం తప్పుగా పెడతారు. దీని వల్ల.. దానికి సరైన సిగ్నల్స్ అందగా.. ఇంటర్నెట్ సమస్య వస్తూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే.. ఇంట్లో ఓ మూలలో రౌటర్ ని పెట్టడం కాకుండా.. ఇంటి మధ్యభాగంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల.. అన్ని గదులకు ఇంటర్నెట్ సరిగ్గా వస్తుంది.
అంతేకాదు.. రౌటర్ ని ఎప్పుడూ పొరపాటున కూడా నేలపై ఉంచకూడదు. ఎక్కువ మంది వీటిని నేలపై లేదంటే.. టీవీ క్యాబినెట్ లో పెట్టేస్తూ ఉంటారు. అలాంటి పొరపాటు చేయకండి. దానికి బదులుగా, 5 నుంచి 7 అడుగుల ఎత్తులో షెల్ఫ్ లేదా గోడకు దగ్గరగా ఉంచితే.. సిగ్నల్ సరిగ్గా వస్తుంది. ఇంటర్నెట్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి.
ఇంట్లో వైఫై రౌటర్ ఉంటే సరిపోదు.. దానిని కొన్ని వస్తువులకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా, టీవీ, ఫ్రిజ్, మైక్రోవేవ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉంచాలి. ఇవి దగ్గరగా ఉంటే..ఇంటర్నెట్ లో అంతరాయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కబోర్డ్స్ లోపల.. పెద్ద అద్దాల వెనక రౌటర్ ని ఉంచకూడదు. ఇక.. రౌటర్ కి సంబంధించిన రెండు యాంటెనాలు.. సరైన దిశలో ఉండేలా చూసుకోవాలి. అంటే.. ఒకటి నిలువుగా ఉంటే.. మరొకటి అడ్డంగా ఉండాలి. అప్పుడు సిగ్నల్స్ సరిగా వస్తాయి.