జాగ్రత్తగా ఉండండి... ఫోన్ కేస్‌లో ఇలాంటివి పెడితే డేంజర్ - మీరు నమ్మకపోయినా ఇది నిజం !

First Published Aug 25, 2023, 7:07 PM IST

మీ మొబైల్ కవర్‌లో డబ్బు లేదా పేపర్  ఉంచడం వల్ల ప్రాణహాని కలగవచ్చు. మొబైల్ యూజర్లు  ఈ విషయాన్ని తప్పక తెలుసుకోండి. మనమందరం బయటికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న వస్తువులను పాకెట్ లో లేకపోతే పర్స్ లో పెడుతుంటాము. ఈ వరుసలో ఇపుడు మొబైల్ ఫోన్లను కూడా వదలడం లేదు. చాలామంది క్యాష్  ఇంకా ATM వంటి కార్డులను బయటికి వెళ్తే తీసుకువెళతాము.
 

అదేవిధంగా, ప్రజలు మొబైల్ కేసుల వెనుక నోట్లు, కాయిన్స్, కీలు వంటి అనేక వస్తువులను పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల పెను ప్రమాదాన్ని సృష్టిస్తుంది. మన స్మార్ట్‌ఫోన్‌లు మంటలు అంటుకోవడం లేదా పేలడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. అయితే ఇలా ఎక్కడో మన అజాగ్రత్త వల్ల కావచ్చు. ఫోన్ ఓవర్ హీట్ అయినప్పుడు చాలా సార్లు ఈ సమస్య వస్తుంది.
 

కానీ దీని వెనుక కారణం ఫోన్  అధిక వినియోగం లేదా దుర్వినియోగం కావచ్చు. సాధారణంగా, ఫోన్ ప్రాసెసర్ లేదా బ్యాటరీపై ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు మంటలు వ్యాపిస్తాయి. ఇది కాకుండా, ఫోన్ కవర్ బ్యాడ్ క్వాలిటీ కారణంగా అగ్ని ప్రమాదం జరగొచ్చు.
 

ఫోన్ కవర్ ప్రాసెసర్‌ను కూడా ప్రభావితం చేస్తుంది ఇంకా   వేడెక్కడానికి కారణమవుతుంది. ఫోన్ కవర్‌పై మండే వస్తువులకు దూరంగా ఉండాలి లేకుంటే నోట్లు  ప్రాసెసర్ వేడెక్కితే మంటలు రావచ్చు.
 

అధిక వేడి  కారణంగా ఫోన్ ఒకోసారి పేలిపోవచ్చు. ఫోన్ కవర్‌పై ఎం పెట్టకుండా చూసుకోండి. ఏ రకమైన ATM, విజిటింగ్ కార్డ్, డబ్బు నోట్లు ఇంకా ఫోన్‌ కవర్ లో  పేపర్ వస్తువులను నివారించండి.
 

click me!