రెడ్ మీ మొబైల్ కొత్త 128జిబి మోడల్ వచ్చేసింది ! ధర వింటే మీరు ఆశ్చర్యపోతారు!

First Published | Aug 24, 2023, 6:22 PM IST

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ   సబ్-బ్రాండ్ అయిన రెడ్ మీ మేలో A2+ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో HD+ డిస్‌ప్లే, MediaTek చిప్‌సెట్ ఉంది. లాంచ్ సమయంలో Redmi A2+ స్మార్ట్‌ఫోన్ 4జీబీ  ర్యామ్, 64జీబీ స్టోరేజ్ తో ఏకైక మోడల్‌గా అందించారు. దీని ధర రూ.8,499.
 

ఇప్పుడు అదే స్మార్ట్‌ఫోన్ కొత్త మోడల్‌ను తీసుకొచ్చారు. ఇందులో ఎక్కువ స్టోరేజీ ఉంటుంది. 4జీబీ  ర్యామ్ తో ఈ కొత్త మోడల్ ఇప్పుడు 128GB స్టోరేజ్ తో  వస్తుంది. Redmi ట్విట్టర్ ద్వారా Redmi A2+ స్మార్ట్‌ఫోన్  ఈ కొత్త వేరియంట్‌ను ప్రకటించింది.
 

పెరిగిన స్టోరేజ్ కాకుండా, ఇతర ఫీచర్లు పాత మోడల్ లాగానే ఉంటాయి. ఆశ్చర్యకరంగా, Redmi A2+ ఫోన్  కొత్త మోడల్ ధర పాత  మోడల్ లాగానే 8,499 రూపాయలకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఫోన్‌ను Amazon, MI.com ఇంకా Xiaomi స్టోర్లలో కోనవచ్చు.


Redmi A2+: ముఖ్యమైన ఫీచర్లు

Redmi A2+లో 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.52-అంగుళాల HD+ డిస్‌ప్లే  ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 4GB RAM తో  64GB స్టోరేజ్  అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు మెమరీ కార్డ్‌తో స్మార్ట్‌ఫోన్ స్టోరేజీని కూడా పెంచుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్ Android 13 (Android 13 Go) ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. డ్యూయల్ సిమ్, 8MP బ్యాక్ కెమెరా, సెల్ఫీలు ఇంకా వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉన్నాయి. ఎక్కువకాలం బ్యాకప్ ఉండే 5000mAh బ్యాటరీ కూడా ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చారు.

Latest Videos

click me!