గూగుల్ సెర్చ్: 'ఆర్యన్ ఖాన్'కి సంబంధించిన కీవర్డ్స్ గూగుల్ నిజంగానే తొలగించిందా..?

First Published | Oct 19, 2021, 6:59 PM IST

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (shahrukh khan)కుమారుడు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. డ్రగ్స్ కేసు(drugs case)లో ఆర్యన్ ఖాన్ అరెస్టయిన సంగతి మీకు తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తరువాత బాలీవుడ్ లో పెద్ద దుమారం  చెలరేగింది. రాజకీయ పార్టీలు కూడా దీనిని తీవ్రంగా ఆరోపించాయి. 

ఒక విధంగా చెప్పాలంటే ఆర్యన్ ఖాన్ అరెస్ట్ (aryan khan arrest)ఒక హై ప్రొఫైల్ కేసు. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి గూగుల్‌లో చాలా సెర్చ్‌లు జరుగుతున్నాయి, కానీ ఈ సెర్చ్‌లో కూడా పెద్ద మార్పు కనిపిస్తుంది, ఈ కారణంగా గూగుల్ పనిపై ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
 

గూగుల్ సెర్చ్‌లో ఆర్యన్ ఖాన్ కీవర్డ్ ఎందుకు రావడం లేదు
సాధారణంగా గూగుల్‌లో ఏదైనా  మీరు కీవర్డ్ కోసం వెతికినప్పుడు సంబంధిత కీవర్డ్‌లు క్రింద కనిపిస్తాయి, కానీ ఆర్యన్ ఖాన్ విషయంలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది. ఉదాహరణకు మీరు సుహానా ఖాన్‌ పేరును గూగుల్‌లో సెర్చ్ చేస్తే, మీకు సుహానా ఖాన్ వయస్సు, సుహానా ఖాన్ ఎత్తు, సుహానా ఖాన్ సినిమా, సుహానా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్, సుహానా ఖాన్ లుక్, సుహానా ఖాన్ ఫోటోలు, సుహానా ఖాన్ పుట్టిన తేదీ వంటి కీలక పదాలు కనిపిస్తాయి. కానీ మీరు ఆర్యన్ ఖాన్‌ పేరును సెర్చ్ చేస్తే సంబంధిత కీలకపదాలు కూడా ఇప్పుడు కనిపించవు, అయినప్పటికీ ఆర్యన్ ఖాన్ బెయిల్, ఆర్యన్ ఖాన్ కేసు, ఆర్యన్ ఖాన్ వయసు, ఆర్యన్ ఖాన్ లేటెస్ట్, ఆర్యన్ ఖాన్ అప్‌డేట్ వంటివి  గూగుల్ ట్రెండ్స్‌(google trends)లో సెర్చ్ ఉన్నాయి.  

Latest Videos


సెర్చ్ రిజల్ట్‌లో కనిపించకపోవడం వల్ల
ఇప్పుడు ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే గూగుల్‌లో ఏదైనా కీవర్డ్‌ని సెర్చ్ చేసిన తర్వాత సంబంధిత కీలకపదాలు వచ్చినప్పుడు ఆర్యన్ ఖాన్ విషయంలో ఎందుకు సంబంధిత కీవర్డ్ రావడం లేదు అనే ప్రశ్న లేనవనేత్తింది. షారుఖ్ ఖాన్ పిఆర్ బృందం గూగుల్ సహకారంతో దీనిని నిర్వహిస్తుందా ? ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన కీలకపదాలు గూగుల్ నుండి తీసివేసే అవకాశం కూడా ఉంది. యూట్యూబ్‌లో కూడా ఇదే పరిస్థితి. యూట్యూబ్‌లో  ఆర్యన్ ఖాన్ కీవర్డ్ శోధన సంబంధిత కీవర్డ్‌లను చూపించడం లేదు.

click me!