ఆపిల్ ఎడ్యుకేషన్ ఆఫర్: విద్యార్ధులకి రూ .14 వేల విలువైన ఎయిర్‌పాడ్‌లు ఫ్రీ..

First Published | Jul 17, 2021, 1:56 PM IST

అమెరికన్ టెక్ దిగ్గజం ఆపిల్ భారతదేశంలో ఎడ్యుకేషన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా విద్యార్థులకు ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా అందిస్తుంది. ఇప్పుడు  ఆపిల్ ఎయిర్ పాడ్స్, ఆపిల్ మాక్ లేదా ఆపిల్ ఐప్యాడ్ కొనుగోలుపై వీటిని ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఆపిల్  ఆన్‌లైన్ స్టోర్‌లో చూడవచ్చు. 

ఈ ఆఫర్ ఇటీవల కాలేజీ లేదా విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థుల కోసం మాత్రమే. మాక్‌బుక్ ఎయిర్, మాక్‌బుక్ ప్రో, ఐమాక్, మాక్ ప్రో, మాక్ మినీ, ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్ కొనుగోలుపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాకుండా ఆపిల్ ఎయిర్‌పాడ్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను రూ .4 వేలకు, ఎయిర్‌పాడ్స్ ప్రోను రూ .10,000 కు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఈ ఆఫర్‌కు అర్హులు అవునా కాదా అని చెక్ చేయడానికి 000800 040 1966 కు కాల్ చేయవచ్చు.
undefined
ఈ ఆఫర్ పొందడానికి మీరు ఆపిల్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టోర్‌లో ఆన్‌లైన్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌తో మీరు ఆపిల్ కేర్‌లో 20% వరకు తగ్గింపు కూడా పొందవచ్చు. అలాగే ఆపిల్ పెన్సిల్, కీబోర్డుపై ఎడ్యుకేషనల్ డిస్కౌంట్ ఇస్తుంది. అంతేకాదు ఆపిల్ గేమింగ్ సర్వీస్ ఆపిల్ ఆర్కేడ్‌కు మూడు నెలలు సబ్ స్క్రిప్షన్ కూడా ఇస్తోంది.
undefined

Latest Videos


ఐఫోన్ 13 లాంచ్దీని గురించి కొన్ని లీకైన నివేదికలు ప్రకారం ఆపిల్ కొత్త ఐఫోన్ సిరీస్ ఐఫోన్ 13ను సెప్టెంబర్ 14న విడుదల చేయబోతోంది, అయితే ఈ విషయంపై ఆపిల్ అధికారిక ప్రకటన చేయకపోయినా, లీక్ అయిన నివేదికలు పేర్కొన్నాయి.
undefined
ఐఫోన్ 13 అధికారిక ప్రకటనకు ముందే ఐఫోన్ 13 కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి. కొత్తగా లీకైన నివేదికలో ఐఫోన్ 12 కంటే ఐఫోన్ 13లో పెద్ద వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ పొందుతుందని పేర్కొన్నారు. అంటే ఐఫోన్ 13లో పెద్ద కాయిల్‌తో ఛార్జింగ్ ప్యాడ్‌ను పొందుతుంది.
undefined
ఆపిల్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌ను ఐఫోన్ 12 సిరీస్‌తో పరిచయం చేసింది. ఇందులో మాగ్‌సేఫ్ టెక్నాలజీ ఉపయోగించారు. ఛార్జింగ్ ప్యాడ్‌తో 15W వరకు వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ లభిస్తుంది. ఐఫోన్ 13 ఛార్జింగ్ ప్యాడ్‌లో పెద్ద కాయిల్ ఉన్నందున, ఛార్జింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఎయిర్‌పాడ్స్‌, ఆపిల్‌ వాచ్‌ వంటి గాడ్జెట్‌లకు రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్ట్ కూడా ఉంటుందని కొన్ని నివేదికలు వెల్లడించాయి.
undefined
click me!