గూగుల్ ఫ్రీ వీడియో కాన్ఫరెన్సింగ్ కి బై బై : ఇప్పుడు ప్రతినెల సబ్ స్క్రిస్ఫన్ కోసం ఎంత చెల్లించాలంటే..?

First Published Jul 14, 2021, 7:47 PM IST

 కరోనా కాలంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ట్రెండింగ్ గా మారింది. ఐటి బృందం కోసం జూమ్ మీటింగ్ యాప్  ఒక అదృష్టంల వరించింది. జూమ్ కి పోటీగా చాలా కంపెనీలు కొత్త కొత్త యాప్స్ కూడా పరిచయం చేశాయి. అంతేకాకుండా కొన్ని కంపెనీలు ప్రస్తుత వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌లో లేటెస్ట్ ఫీచర్లను కూడా అందించాయి. 

వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ లో అత్యంత ప్రచుర్యం పొందిన యాప్స్ లో గూగుల్ మీట్ ఒకటి. ప్రస్తుతం గూగుల్ మీట్ ఇప్పటి వరకు ఫ్రీగా ఉండేది కాని ఇప్పుడు మీరు నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు ఉపయోగించాలంటే ఛార్జీలు చెల్లించాలి. గూగుల్ మీట్ యూజర్లు ప్రస్తుతం కేవలం ఒక గంట పాటు మాత్రమే వీడియో కాన్ఫరెన్సింగ్‌ను ఉచితంగా చేయవచ్చు. 55 నిమిషాలు పూర్తయిన తర్వాత కాల్ ముగించమని అడుగుతూ మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. నిర్ణీత సమయం కంటే మీరు మీ కాలింగ్‌ను కొనసాగించాలనుకుంటే మీరు ఇప్పుడు గూగుల్ మీట్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
undefined
మీరు గూగుల్ మీట్ ద్వారా ఫ్రీగా ఎక్కువసేపు వీడియో కాల్స్ చేయాలనుకుంటే ఇక మీరు ప్రతి నెలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 1 గంట కంటే ఎక్కువ సేపు గ్రూప్ వీడియో కాలింగ్ కోసం మీరు గూగుల్ వర్క్‌స్పేస్ సబ్ స్క్రిప్షన్ తప్పనిసరి, దీని కోసం మీరు 9.99 డాలర్లు ఖర్చు చేయాలి, అంటే నెలకు సుమారు రూ.750. సబ్ స్క్రిస్ఫన్ లేని గూగుల్ మీట్ ఖాతాల కోసం వీడియో కాలింగ్ టైమ్ 60 నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
undefined
మీకు గూగుల్ ఖాతా ఉంటే ఒకేసారి 100 మందితో ఎటువంటి టైం లిమిట్ లేకుండా ఉచిత మీటింగ్స్ నిర్వహించవచ్చని గత సంవత్సరం గూగుల్ ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. గూగుల్ మీట్ ని ఏప్రిల్ 2020లో ప్రారంభించారు.
undefined
గతేడాది మల్టీమీడియా మెసేజింగ్ యాప్ హ్యాంగ్అవుట్స్ నుండి గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను గూగుల్ తొలగించింది. ఆ తరువాత గూగుల్ హ్యాంగ్అవుట్స్ యూజర్లను కొత్త వీడియో కాలింగ్ యాప్ గూగుల్ మీట్‌కు మళ్ళించింది.
undefined
click me!