ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను ఇండియాలో లాంచ్ చేసిన అమెరికన్ కంపెనీ.. దీని ప్రత్యేకతలు ఇవే..

First Published | Sep 18, 2021, 7:23 PM IST

ఫ్రంట్ లోడ్‌తో వచ్చే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్స్ విజయవంతం అయిన తర్వాత అమెరికన్ కంపెనీ వైట్-వెస్టింగ్‌హౌస్ ఇండియన్ మార్కెట్లోకి  ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్‌లను ప్రవేశపెట్టింది. ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల శ్రేణిలో కంపెనీ 6.5 కేజీలు, 7.5 కేజీలు, 8.5 కేజీలు, 10.5 కేజీల మోడళ్లతో మొత్తం  నాలుగు మోడళ్లను పరిచయం చేసింది. అయితే వీటిని అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయించనున్నారు. 
 

ధర పరంగా 6.5 కిలోల మోడల్ ధర రూ .12,499, 7.5 కేజీల మోడల్ ధర రూ .14,499, 8.5 కేజీల మోడల్ ధర రూ .23,499, 10.5 కేజీల మోడల్ ధర రూ .28,499గా ఉంది. పండగ సీజన్‌లో 30వేల  యూనిట్ల వాషింగ్ మెషిన్‌లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.


ఈ వాషింగ్ మెషీన్స్ అన్నీ  టాప్ లోడ్‌తో వస్తాయి. వాటితో పాటు 40 లీటర్ల డ్రమ్ ఉంటుంది. అంతేకాకుండా, ఈ వాషింగ్ మెషీన్‌లలో ఇంటెలిజెంట్ వాషింగ్ సిస్టమ్, ఆటో బ్యాలెన్స్, ఫోమ్ సెన్సింగ్ అండ్ రిమూవల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

అంతేకాకుండా ఆటోమేటిక్ రిస్టార్ట్  ఆప్షన్ ఈ వాషింగ్ మెషీన్స్ లో  ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. ఈ వాషింగ్ మెషీన్స్ ప్రతిసారికి 48 లీటర్ల నీటిని వినియోగిస్తుంది.

ఇది కాకుండా వాటర్‌ప్రూఫ్ కోసం ఐ‌పిX4 రేటింగ్‌ను పొందింది. దీనితో పాటు డిస్‌ప్లే ప్యానెల్ కూడా ఉంటుంది, దీనిలో టైమ్ ఇండికేటర్, స్టార్ట్/పాజ్, డోర్ లాక్ ఇండికేషన్, ఎర్రర్ మెసేజ్ ఇండికేషన్, ఎర్రర్ మెసేజ్ అలారం గురించి సమాచారం ఉంటుంది. భారతదేశంలో వైట్ వెస్టింగ్‌హౌస్ వాషింగ్ మెషీన్‌ను ఎస్‌పి‌పి‌ఎల్ తయారు చేస్తుంది.

click me!