అమెజాన్ ప్రైమ్ v డిస్నీ హాట్‌స్టార్ vs నెట్‌ఫ్లిక్స్: ధరలు పెరిగిన తర్వాత ఏది బెస్ట్..

Ashok Kumar   | Asianet News
Published : Dec 15, 2021, 04:48 PM IST

అమెజాన్ ప్రైమ్(amazon prime) వీడియో ప్లాన్‌లు 13 డిసెంబర్ 2021 నుండి 50 శాతం పెరగనున్నాయి. కొద్ది రోజుల క్రితం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్(disney hotstar) ప్లాన్‌లు కూడా ఖరీదైనవిగా మారాయి. ఓ వైపు అన్ని ఓ‌టి‌టి కంపెనీలు సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలను పెంచుతు మారుస్తుంటే, మరోవైపు నెట్‌ఫ్లిక్స్(netflix)  ప్లాన్‌ల ధరలను 60 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ ప్రారంభ ధర ఇప్పుడు రూ.149కి చేరింది. అయితే  ఏ కంపెనీ ప్లాన్ తక్కువ ధరలో ఉన్నాయో తెలుసుకుందాం..

PREV
13
అమెజాన్ ప్రైమ్ v డిస్నీ హాట్‌స్టార్ vs నెట్‌ఫ్లిక్స్: ధరలు పెరిగిన తర్వాత ఏది బెస్ట్..

నెట్‌ఫ్లిక్స్ ప్లాన్
నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ అంటే ప్రతినెల ప్లాన్ ఇప్పుడు రూ.149కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా బేసిక్ ప్లాన్ ధర గతంలో రూ.499గా ఉండేది కానీ ఇప్పుడు రూ.199కి చేరింది. ఈ ప్లాన్‌పై గరిష్ట తగ్గింపు చేసింది. నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ ప్లాన్ ఇప్పుడు రూ. 499 చేరింది గతంలో దీని ధర రూ.649. మరోవైపు నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం ప్లాన్‌ను ఇప్పుడు రూ.649కి తీసుకోవచ్చు, గతంలో దీని ధర రూ.799. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్‌లో స్టాండర్డ్ డెఫినిషన్ (SD) 480 పిక్సెల్ రిజల్యూషన్‌లో కంటెంట్‌లు అందుబాటులో ఉంటాయి. హెచ్‌డి అంటే 1080 పిక్సెల్‌ల కంటెంట్ స్టాండర్డ్ ప్లాన్‌లో అందుబాటులో ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్  ప్రీమియం (Netflix Premium)లో కస్టమర్‌లు 4K రిజల్యూషన్ అండ్ HDRలో కంటెంట్‌ను చూడవచ్చు.

23

అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్
కొత్త అప్‌డేట్ తర్వాత అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్  రూ.999 ప్యాక్ ధర రూ.1,499కి మారింది. దీని వాలిడిటీ 12 నెలలు. అలాగే  రూ.329 త్రైమాసిక ప్లాన్ ధర రూ.459 కాగా, రూ.129 ప్రతినెల ప్లాన్ ధర రూ.179కి పెరిగింది. 

33

డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్‌లు
 డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్ ధర రూ. 499,  అంటే ఒక సంవత్సర ప్యాకేజ్. ఇందులో వినియోగదారులు 720 పిక్సెల్‌ల కంటెంట్‌ను చూడవచ్చు. కంపెనీ రెండవ ప్లాన్ వార్షికంగా రూ. 899. ఈ ప్లాన్‌లో 1080 పిక్సెల్‌ల కంటెంట్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ కింద కంటెంట్‌ని ఫోన్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్‌లు అండ్ టీవీలలో వీక్షించవచ్చు. పైన పేర్కొన్న రెండు ప్లాన్‌లలో ప్రకటనలు కూడా ఉంటాయి. కంపెనీ ప్రీమియం ప్లాన్ లో  వార్షిక ప్లాన్‌ కూడా ఉంది, దీని ధర రూ. 1,499. ఇందులో కంటెంట్ 4K అంటే 2160 పిక్సెల్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ తో ఏకంగా నాలుగు స్క్రీన్లపై వీడియోలు చూడొచ్చు.

click me!

Recommended Stories