డౌన్‌లోడ్ స్పీడ్ మెరుగుపడింది
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, 4G డౌన్‌లోడ్ స్పీడ్ పరంగా నవంబర్‌లో జియో మొదటి స్థానంలో నిలవగా దాని తర్వాత వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (VIL), భారతి ఎయిర్‌టెల్ ఉన్నాయి. అయితే నవంబర్‌లో ఈ రెండు కంపెనీల డౌన్‌లోడ్ స్పీడ్ కూడా మెరుగుపడింది.
నవంబర్‌లో జియో నెట్‌వర్క్ ఆవరేజ్ 4G డేటా డౌన్‌లోడ్ స్పీడ్ సుమారు 10 శాతం పెరిగింది, అయితే వొడాఫోన్ ఐడియా స్పీడ్ 8.9 శాతం, ఎయిర్‌టెల్ 5.3 శాతం పెరిగింది. అక్టోబర్‌లో 4జీ డేటా అప్‌లోడ్‌లో వొడాఫోన్ ఐడియా అగ్రస్థానం దక్కించుకుంది. దీని నెట్‌వర్క్ 8 mbps అప్‌లోడ్ స్పీడ్‌ను నమోదు చేసింది, అంటే గత ఐదు నెలల్లో అత్యధికం.
స్పీడ్ ఎలా పని చేస్తుంది?
మంచి డౌన్‌లోడ్ స్పీడ్ కస్టమర్‌లు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న కంటెంట్‌ను యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేస్తుంది, అయితే మెరుగైన అప్‌లోడ్ స్పీడ్ వారి కాంటాక్ట్స్ లకు డేటా లేదా ఫోటోలను లేదా వీడియోలను వేగంగా షేర్ చేయడానికి సహాయపడుతుంది.
ఐదు నెలల్లో ఎయిర్‌టెల్ అత్యుత్తమ అప్‌లోడ్ స్పీడ్ నవంబర్‌లో 5.6 mbps కాగా, జియో 7.1 mbpsను సాధించింది. రియల్-టైం ప్రాతిపదికన మైస్పీడ్ అప్లికేషన్ సహాయంతో భారతదేశం అంతటా సేకరించిన డేటా ఆధారంగా ఆవరేజ్ స్పీడ్ ని ట్రాయ్ గణిస్తుంది.