మొబైల్ నంబర్లో 10 అంకెలు ఎందుకు ఉంటాయి..? దీని వెనుక ఆసక్తికరమైన కారణం తెలుసా ?

Ashok Kumar   | Asianet News
Published : Dec 15, 2021, 12:58 PM ISTUpdated : Dec 15, 2021, 07:51 PM IST

భారతదేశంలో 10 అంకెల మొబైల్ నంబర్లు (mobile numbers)ఎందుకు ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? నేడు ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు (mobile phones)పెద్ద ఎత్తున ఉపయోగించబడుతున్నాయి. ఈ ఆధునిక యుగానికి ఊతమివ్వడంలో మొబైల్ ఫోన్‌లు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచం(world) ఒక ఉమ్మడి కుటుంబంగా మారింది. 

PREV
15
మొబైల్ నంబర్లో 10 అంకెలు ఎందుకు ఉంటాయి..? దీని వెనుక ఆసక్తికరమైన కారణం తెలుసా ?

అందుకే ఈ యుగాన్ని ప్రపంచీకరణ అని పిలుస్తారు. ఈరోజు మనుషులు బౌతికంగా దూరంగా ఉన్న మొబైల్ ఫోన్లు దూరాన్ని దగ్గర చేశాయి. మొబైల్ ఫోన్లు భౌగోళిక దూరాలను తొలగించడానికి ఎంతో పనిచేశాయి. ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో దూరపు బంధువులతో గంటల తరబడి మాట్లాడగలుగుతున్నాం. అయితే, మరొకరితో ఫోన్‌లో మాట్లాడే ముందు మనం మొబైల్ నంబర్‌కు డయల్ చేస్తాం. భారతదేశంలో మొబైల్ నంబర్లు 10 అంకెలతో ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్న మీలో చాలా మందికి తలెత్తి ఉంటుంది. ఈ రోజు  దీని గురించి తెలుసుకుందాం..

25

 భారతదేశంలో 10 అంకెల ఫోన్ నంబర్లు ఎందుకు ఉన్నాయి? దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ జాతీయ నంబరింగ్ పథకం. ఈ విధంగా మొబైల్ నంబర్ 0 నుండి 9 వరకు ఒకే  సింగిల్ డిజిట్ నంబర్ ఉంటే, అది కేవలం 10 మందికి మాత్రమే పంపిణీ చేయబడుతుంది.
 

35

అయితే మొబైల్ నంబరు  2 అంకెలలో ఉంటే దానిని 100 మందికి మాత్రమే పంపిణీ చేయవచ్చు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన ఫోన్ నంబర్‌ను పొందలేరు. భారతదేశంలో 10 అంకెల నంబరును ఎందుకు తయారు చేశారో మీరు అర్థం చేసుకోవాలి ? దీనికి ముఖ్య కారణం భారతదేశ జనాభా 131 కోట్లు. ఈ కారణంగా మొబైల్ నంబర్ల సంఖ్యను 10 అంకెలుగా ఉంచారు. 
 

45

మొబైల్ నంబర్ 10 అంకెలు ఉన్నందున ప్రతి ప్రత్యేక నంబర్‌ను ప్రజలకు సులభంగా పంపిణీ చేయవచ్చు. లెక్కల ప్రకారం చూస్తే 10 సంఖ్యల సహాయంతో వెయ్యి కోట్ల వివిధ నంబర్లను  సృస్టించవచ్చు.

55

భారతదేశంలో మొదట్లో 9 అంకెల నంబర్లు మాత్రమే ఉపయోగించబడ్డాయి. అయితే భారతదేశ జనాభా వేగంగా పెరుగుతున్న దృష్ట్యా నంబర్ల అంకెల సంఖ్యను 10కి పెంచారు.
 

click me!

Recommended Stories