వైర్‌లెస్ ఛార్జింగ్ తో నథింగ్ ఫోన్ 1 లాంచ్.. ఊహించని ఫీచర్లతో వన్ ప్లస్ కి పోటీగా..

First Published | Jun 9, 2022, 11:24 AM IST

యూ‌కే టెక్ స్టార్ట్ అప్ నథింగ్(Nothing) మొదటి ఫోన్ ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. నథింగ్ ఫోన్ 1 టీజర్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ చేశారు. జూలై 12న నథింగ్ ఫోన్ 1 లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా తెలిపింది. నథింగ్ ఫోన్ 1 లాంచ్ వర్చువల్ ఈవెంట్‌లో జరుగుతుంది.

ఈ లైవ్ ప్రసారాన్ని కంపెనీ సోషల్ మీడియా హ్యాండిల్ అండ్ యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చు. నథింగ్ ఫోన్ 1  టీజర్ ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానెల్‌తో ప్రారంభించవచ్చు. రాత్రి 8.30 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. లాంచ్ కోసం కంపెనీ మీడియా ఆహ్వానాన్ని కూడా పంపింది.

నథింగ్ ఫోన్ 1  ఫీచర్లు
నథింగ్ ఫోన్ 1  ఫీచర్ల గురించి అధికారికంగా కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు కానీ చాలా లీకైన నివేదికలు ఫోన్  ఫీచర్స్ వెల్లడించాయి. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్  ఉంటుంది. నథింగ్ ఫోన్ 1 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.55-అంగుళాల OLED డిస్‌ప్లేను పొందుతుంది. డిస్ప్లే  ప్యానెల్ ఫ్లాట్‌గా ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఫోన్  వైర్‌లెస్ ఛార్జింగ్ తో వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 

Latest Videos


నథింగ్  ఫోన్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను పొందుతుంది ఇంకా ఆండ్రాయిడ్ ఆధారంగా నథింగ్ OS ఉంటుంది. కంపెనీ మొదటి ఉత్పత్తి నథింగ్ ఇయర్ 1   వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.

సమాచారం ప్రకారం, నథింగ్ ఫోన్ 1 ధర 500 యూరోలు అంటే దాదాపు రూ.41,400. ఈ ఫోన్ టీజర్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో విడుదలైంది. కొన్ని నెలల క్రితం  వచ్చిన నివేదిక ప్రకారం, నథింగ్ ఫోన్ 1 స్నాప్‌డ్రాగన్ 788G ప్రాసెసర్‌తో 8జి‌బి ర్యామ్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేతో లాంచ్ అవ్వోచ్చు.

నథింగ్ ఫోన్ 1 కెమెరా గురించి మాట్లాడితే దీనిలో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌లుగా ఉంటుంది. రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ యాంగిల్‌ అండ్ మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్‌లో ఉంటుంది. ఈ నథింగ్  ఫోన్ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను పొందుతుంది.

click me!