హై-స్పీడ్ డేటాతో పాటు
IPL 2025ని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ₹451 డేటా వోచర్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది లైవ్ స్పోర్ట్స్, సినిమాలు, డాక్యుమెంటరీల స్ట్రీమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లాన్. ఈ ప్లాన్‌లో హై-స్పీడ్ డేటాతో పాటు Disney+ Hotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
₹451 ప్లాన్ వివరాలు
50GB హై-స్పీడ్ డేటా. 30 రోజుల వ్యాలిడిటీ. 90 రోజుల Disney+ Hotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. వినియోగదారులకు ఇప్పటికే బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ ఉంటేనే ఈ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది.
ఈ ప్లాన్ ఎవరికి?
IPL మ్యాచ్‌లు, సినిమాలు, షోలు లేదా OTT కంటెంట్ కోసం ఎక్కువ డేటా అవసరమైన వారికి ఇది అనువుగా ఉంటుంది. ఇప్పటికే యాక్టివ్ బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ ఉన్నవారికి. తక్కువ సమయం కోసం హై-స్పీడ్ డేటా కావలసిన వారికి. ఖరీదైన సబ్‌స్క్రిప్షన్ లేకుండా Disney+ Hotstar యాక్సెస్ కావలసిన వారికి కూడా.
IPL 2025 & OTT
ఎయిర్‌టెల్ ₹451 డేటా వోచర్ IPL 2025ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. మీరు ప్రయాణంలో లైవ్ మ్యాచ్‌లు చూడాలనుకుంటే, ఈ ప్లాన్ మీకు సరైనది. 50GB డేటా, 90 రోజుల పూర్తి వినోదం.
ఎయిర్‌టెల్ ₹398 ప్లాన్
ఎయిర్‌టెల్ ₹398 ప్లాన్ కూడా అద్భుతమైనది. 28 రోజులకు రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు, ఉచిత 5G యాక్సెస్, ఒక నెల Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్. ఎయిర్‌టెల్ ₹195 ప్లాన్ కూడా చాలా ఉంది. దీంతో 15GB డేటా. 90 రోజుల జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్.